Mangoes: సీజన్‌ కదా అని మామిడిపళ్లను తెగ తినేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

పండ్లలో రారాజు మామిడి పండు. దీని రుచికి సాటి మరోటి ఉండదంటే అతిశయోక్తి కాదు. మామిడిపండ్లను చూస్తేనే నోరూరుతుంది అందరికీ? దీనిని ఇష్టపడనివారుండరు. రుచిలోనే కాదు ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తినడానికి ఓ పద్ధతి ఉంటుంది. మరి మీరు మామిడిపళ్లను సరైన పద్ధతిలోనే తింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పండును తినడానికి పద్ధతేంటండి బాబు... అనుకుంటున్నారా?

Mangoes: సీజన్‌ కదా అని మామిడిపళ్లను తెగ తినేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

|

Updated on: Jun 05, 2024 | 6:56 PM

పండ్లలో రారాజు మామిడి పండు. దీని రుచికి సాటి మరోటి ఉండదంటే అతిశయోక్తి కాదు. మామిడిపండ్లను చూస్తేనే నోరూరుతుంది అందరికీ? దీనిని ఇష్టపడనివారుండరు. రుచిలోనే కాదు ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తినడానికి ఓ పద్ధతి ఉంటుంది. మరి మీరు మామిడిపళ్లను సరైన పద్ధతిలోనే తింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పండును తినడానికి పద్ధతేంటండి బాబు… అనుకుంటున్నారా? అవును.. మామిడిపండ్ల మీద ఒకరకం ఫైటిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీ తలెత్తొచ్చు. దురద పుట్టొచ్చు. అందువల్ల మామిడికాయలనైనా, పండ్లనైనా శుభ్రంగా కడగటం చాలా ముఖ్యం. తొడిమ వద్ద అంటుకొనే సొన పూర్తిగా పోయేలా శుభ్రం చేయాలి. ఇందుకోసం మామిడిపండ్లను నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టి, కడగటం మంచిది. దీంతో అధికంగా ఉన్న ఫైటిక్‌ ఆమ్లం తొలగిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం- భోజనంతో పాటు పండ్లను తినకూడదు. కానీ, మామిడిపండ్లు దీనికి మినహాయింపు. వీటిని పాలతో కలిపి తీసుకుంటే మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది. అంతేకాదు.. శృంగారం మీద ఆసక్తినీ పెంచుతుంది. పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు.. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, సొరియాసిస్‌, ల్యూపస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బులు.. చర్మ సమస్యలు గలవారు మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు.

ఇక మామిడిలో యాంటీఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు, మ్యాంగిఫెరిన్‌ వంటి వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తొక్కతో పాటు తింటేనే ఇవి అందుతాయి. ఎందుకంటే ఇవి తొక్క కిందే ఉంటాయి కాబట్టి. మామిడిపండ్లు విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి. ఇవి దీర్ఘకాల మలబద్ధకం తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు బయటపడింది. మామిడిలో విటమిన్‌ ఎ, సి దండిగా ఉంటాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజెన్‌ ఏర్పడటంలో పాలు పంచుకుంటాయి. అంటే ఇవి చర్మం నిగనిగకూ తోడ్పడతాయన్నమాట. ఇలా వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!