KA Paul: అయ్యయ్యో.! 140 దేశాల ప్రెసిడెంట్లను గెలిపించిన కేఏ పాల్‌కి వచ్చింది ఇన్ని ఓట్లేనా.?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో తన దండయాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగిన ఆయనకు ఘోర పరాజయం ఎదురైంది. దీంతో అయన తనదైనశైలిలో స్పందించారు. ఆయనకు చాలా పోలింగ్ బూత్‌లలో.. ఆ వివరాలు ఇలా..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో తన దండయాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగిన ఆయనకు ఘోర పరాజయం ఎదురైంది. దీంతో అయన తనదైనశైలిలో స్పందించారు. ఆయనకు చాలా పోలింగ్ బూత్‌లలో ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. మురళీనగర్‌లోని 235 బూత్‌లో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు అక్కడ వచ్చినవి నాలుగంటే నాలుగు ఓట్లేనని చెప్పారు.
రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని, అప్పట్లో మోదీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఈసారి సీసీటీవీ లింక్‌లను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరికి తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులే చెప్పారని, కానీ 8 బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఇలా ఏకపక్షంగా ఓట్లేసుకుంటే ఎన్నికలు ఎందుకని, రీపోలింగ్ కోసం ఇప్పటికే కోర్టుకెక్కానని, 6న హియరింగ్ ఉందని పాల్ పేర్కొన్నారు.
ఇది చదవండి: ఓటమిని అంగీకరించిన మంత్రి రోజా.. ఊహించని ట్వీట్.. ఏమన్నారంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

