Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!

Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!

Anil kumar poka

|

Updated on: Jan 03, 2025 | 11:40 AM

క్యాన్సర్ తో బాధపడుతున్నకన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్దిరోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్‌కుమార్‌, నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా, శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. ఈ వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్.. శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్టులు నెగెటివ్ గా వచ్చాయి. పాథాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగెటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరువలేనని భావోద్వేగంతో అన్నారామె. ఆ తర్వాత మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నా అన్నారు. కీమో తీసుకుంటూనే ఫైట్ సీన్‌లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ తనకు ధైర్యాన్నిచ్చింది అన్నారు శివన్న. అంతేకాదు పలువురి పేర్లను ప్రస్తావించన శివన్న.. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉంటోన్న సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.