Ginger juice: ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే ఈ బెనిఫిట్స్ మీ సొంతం.
ఉదయం నిద్రలేవగానే చాలామందికి టీ తాగడం అలవాటు ఉంటుంది. మరి ఆ టీలో చిన్న అల్లం ముక్కవేసుకొని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. ఈ అల్లం ఆయుర్వేదం మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది పురాతన వైద్యంలో వివిధ వ్యాధులను నివారించడానికి ఒక మూలికగా ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే అల్లం రసం లేదా టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్రలేవగానే చాలామందికి టీ తాగడం అలవాటు ఉంటుంది. మరి ఆ టీలో చిన్న అల్లం ముక్కవేసుకొని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. ఈ అల్లం ఆయుర్వేదం మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది పురాతన వైద్యంలో వివిధ వ్యాధులను నివారించడానికి ఒక మూలికగా ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే అల్లం రసం లేదా టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవారు అయితే ఉదయాన్నే అల్లం నీటిని తీసుకోవడం మంచిది. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, క్రోమియం వంటి అవసరమైన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అల్లం రసం జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం, వికారం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణుడు అవనీ కౌల్ చెప్పారు. అంతేకాదు అల్లం రసం తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది మంచి ఔషధం.
ఇది సహజ రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని బలపరుస్తుంది. ఈ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అల్లం రసంలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ సెల్యులార్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో సహజంగా వచ్చే వికారాన్ని అల్లం నివారిస్తుంది. విశ్రాంతి లేకపోవడం, మైగ్రేన్ లేదా మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా ఇది సాధారణ కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

