Patanjali: కేంద్రం కళ్లు మూసుకుందా.? పతంజలి ప్రకటనలపై సుప్రీం ఆగ్రహం.!

తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక జాప్యం వద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది.

Patanjali: కేంద్రం కళ్లు మూసుకుందా.? పతంజలి ప్రకటనలపై సుప్రీం ఆగ్రహం.!

|

Updated on: Feb 29, 2024 | 4:41 PM

తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక జాప్యం వద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ‌కు గతంలోనే సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తమ ఉత్ప‌త్తుల వ‌ల్ల కొన్ని వ్యాధులు న‌యం అవుతాయంటూ ప‌తంజ‌లి కంపెనీ కొన్ని ప్రక‌ట‌నలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐఎంఏ కిందటి ఏడాది కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ‌ ఉత్పత్తుల‌ను, ఆ ఉత్ప‌త్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పతంజలి ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని చూడాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..