Twin Sisters: తల్లిదండ్రులను మిస్‌ అవుతున్నాం.! ప్రధాని మోదీకి కవల అక్కాచెల్లెళ్ల భావోద్వేగ లేఖ..

Twin Sisters: తల్లిదండ్రులను మిస్‌ అవుతున్నాం.! ప్రధాని మోదీకి కవల అక్కాచెల్లెళ్ల భావోద్వేగ లేఖ..

Anil kumar poka

|

Updated on: Feb 29, 2024 | 4:48 PM

రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన కవల సోదరీమణులు అర్చిత, అర్చన తమ తల్లిదండ్రుల ఉద్యోగ బదిలీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులైన వీరి తల్లిదండ్రులు ఇద్దరికీ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయింది. ప్రస్తుతం వీరు దౌసాలో వారి అత్త ఇంటిలో ఉంటున్నారు. అర్చిత, అర్చన తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలియజేశారు.

రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన కవల సోదరీమణులు అర్చిత, అర్చన తమ తల్లిదండ్రుల ఉద్యోగ బదిలీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులైన వీరి తల్లిదండ్రులు ఇద్దరికీ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయింది. ప్రస్తుతం వీరు దౌసాలో వారి అత్త ఇంటిలో ఉంటున్నారు. అర్చిత, అర్చన తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలియజేశారు. తమ తల్లిదండ్రులను జైపూర్‌కు బదిలీ చేయాలని కోరారు. ఈ భావోద్వేగ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. లేఖలో ఏం రాశారంటే.. ‘నా పేరు అర్చిత, అక్క పేరు అర్చన. మా ఇద్దరి వయసు 12 ఏళ్లు. మేమిద్దరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినులం. మేమిద్దరం మా అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాం. మా నాన్న పేరు దేవపాల్ మీనా, అమ్మ పేరు హేమలత కుమారి మీనా. మా నాన్న పంచాయితీ సమితి చౌతాన్‌లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్, బలోత్రాలో టీచర్‌. వారికి ఉద్యోగ బదిలీ అయిన కారణంగా మేమిద్దరం మా తల్లిదండ్రులను చాలా మిస్ అవుతున్నాం. వారు లేకుండా మాకు చదువుకోవాలని అనిపించడం లేదు. మా తల్లిదండ్రులను జైపూర్‌కి బదిలీ చేయాలని కోరుతున్నాం అని రాశారు. అర్చిత, అర్చన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బదిలీ చేయడం అంత సులభం కాదు. అయితే ఈ చిన్నారుల సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తారా? లేదా రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్ శర్మ ఈ పిల్లల ఆవేదనపై దృష్టి సారిస్తారా? అనేది వేచి చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos