Mystery Ship: నీట మునిగిన నౌక.. 120 ఏళ్లకు వీడిన మిస్టరీ! పరిశోధనలో బయటపడ్డ శిథిలాలు.
దాదాపు 120 ఏళ్ల క్రితం సముద్రంలో అదృశ్యమైన ఓ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆస్ట్రేలియా తీరంలో సముద్రగర్భంలో దాన్ని గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం.. ఎస్‌ఎస్ నెమెసిస్ అనే నౌక 1904లో బొగ్గు లోడుతో న్యూక్యాసెల్ నుంచి మెల్‌బోర్న్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో న్యూసౌత్‌వేల్స్ తీరంలో భారీ తుపాను ధాటికి నీట మునిగింది. అందులోని 32 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు.
దాదాపు 120 ఏళ్ల క్రితం సముద్రంలో అదృశ్యమైన ఓ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఆస్ట్రేలియా తీరంలో సముద్రగర్భంలో దాన్ని గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం.. ఎస్‌ఎస్ నెమెసిస్ అనే నౌక 1904లో బొగ్గు లోడుతో న్యూక్యాసెల్ నుంచి మెల్‌బోర్న్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో న్యూసౌత్‌వేల్స్ తీరంలో భారీ తుపాను ధాటికి నీట మునిగింది. అందులోని 32 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఇది జరిగిన కొన్ని వారాలకు కొంతమంది మృతదేహాలు, నౌకకు సంబంధించిన శకలాలు సిడ్నీకి 29 కి.మీ. దూరంలోని క్రోనులా బీచ్‌కు కొట్టుకువచ్చాయి. ఓడ ఆచూకీ మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఓ రిమోట్ సెన్సింగ్ కంపెనీ 2022లో సిడ్నీ తీరంలో సముద్ర భూభాగాన్ని శోధిస్తుండగా.. అనుకోకుండా ఓ నౌక శిథిలాలు లభ్యమయ్యాయి. న్యూసౌత్‌వేల్స్‌లోని వొలొంగాంగ్ తీరం నుంచి 28 కి.మీ. దూరంలో, దాదాపు 160 మీటర్ల లోతున వాటిని గుర్తించింది. రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా శాస్త్రీయ పరిశోధన సంస్థ నిపుణులు విశ్లేషణలు జరిపి.. తాజాగా దాన్ని ఎస్‌ఎస్ నెమెసిస్’గా తేల్చారు. 73 మీటర్ల పొడవైన ఈ ఓడలో కొన్ని నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. లైఫ్ బోట్‌లను మోహరించే సమయం లేనంత వేగంగా మునిగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులు ముందుకురావాలని అధికారులు కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

