TOP 9 ET: వారసుడు వస్తున్నాడు.. | అమరానాథ్ యాత్రలో సాయి పల్లవి.. వీడియో.
పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ సినిమాలోని 'జానవులే...' పాటను ఈరోజు అంటే జులై 15న తిరుపతిలో ఆవిష్కరించారు. ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్‌లో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు.
01.Sitara
ఇప్పటికే అటు సోషల్ మీడియాలోనూ.. బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ లోనూ దూసుకుపోతున్న మహేష్ డాటర్ సితార.. మహేష్ వారసురాలిగా.. తనను ప్రౌడ్‌గా ఫీలయ్యేలానే చేస్తున్నారు. మరి సితారను పక్కకు పెడితే.. వాట్ ఎబౌట్ గౌతమ్? అని థింక్ చేస్తున్న వారికి తాజాగా నమ్రత దిమ్మతిరిగే ఇన్ఫో ఇచ్చారు. ఇంకో ఏడెనిమిదేళ్లలో.. గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. ఘట్టమనేని ఫ్యాన్స్ ను తెగ ఖుషీ అయ్యేలా చేశారు.
02.Sai pallavi
తన నేచురల్ యాక్టింగ్‌తో.. లేడీ పవర్ స్టార్ గా నామ్ కమాయించిన సాయిపల్లవి తాజాగా తన కుటుంబ సభ్యులతో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినట్టు.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసుకున్నారు. 60 ఏళ్ల తన తల్లిదండ్రులు, దారిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం చూసి, ‘ఇంత దూరంలో ఎందుకున్నావు దేవుడా’ అని అనిపించిందని చెప్పారు. అమర్‌నాథ్ పవర్‌ఫుల్ ప్లేస్ అని, ఎన్నో విషయాలను నేర్పిందని, ఈ యాత్ర వల్ల, మనుషులు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలన్న విషయం మరోసారి అర్థమైందని అన్నారు సాయిపల్లవి.
03. Project K
ప్రాజెక్ట్ కె కామికాన్ కు వెళ్లేందుకు టైం దగ్గర పడుతున్న వేళ.. ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రాజెక్ట్ కె లో కే.. అంటే ఏంటనే క్యూరియాసిటీ అందర్లో విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ఇది పక్కకు పెడితే.. ఈ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ కామికాన్ వేదికగానే జులై 20న రివీల్ అవుతోంది.
04. Bro
పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమాలోని ‘జానవులే…’ పాటను ఈరోజు అంటే జులై 15న తిరుపతిలో ఆవిష్కరించారు. ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్‌లో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ నెల 28న విడుదల కానుంది ‘బ్రో’ మూవీ.
05. Bagavanth Kesari
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రజెంట్ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. వచ్చే నెలాఖరు కల్లా షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
06.Thamanna
ఇక తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని చెప్పారు నటుడు విజయ్ వర్మ. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నట్టు ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందని తన మనసులోని మాటను చెప్పారు. అంతేకాదు ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు, తనను ప్రేమిస్తున్నట్టు స్టెట్మెంట్ ఇచ్చారు. ఆమె రాకతో తన జీవితంలో విలన్ దశ ముగిసిపోయిందని, రొమాంటిక్ దశ మొదలైందని ఫన్నీ కమెంట్స్ చేశారు. కానీ ఏదైతేనే.. తాను తమన్నాతో ఎంత గాఢంగా ప్రేమలో ఉన్నాడనేది చెప్పారు ఈ యంగ్ యాక్టర్ .
07.Vijay son
ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా 1999లో అజిత్, దేవయాని నటించిన నీ వరువాయన మూవీకి సీక్వెల్లోనట. ఇక ఈ మూవీలో దేవయాని కుమార్తె ఇనియానే.. జేసన్ పక్కన హీరోయిన్ నటిస్తున్నారట. అయితే ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్ లో విపరీతంగా తిరుగుతోంది. కానీ తన కొడుకు ఇప్పుడప్పుడే సినిమాల్లోకి రాడని రీసెంట్ గా విజయ్ చెప్పిన మాటలను ఈ న్యూస్ కాంట్రడిక్ట్ చేస్తోంది.
08.ALia
అమ్మ అయ్యాక షార్ట్ బ్రేక్ తీసుకున్న అలియా భట్ మళ్లీ బిజీ అవుతున్నారు. YRF ప్రెస్ట్రీజియస్‌గా రూపొందిస్తున్న స్పై యూనివర్స్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే స్పై యూనివర్స్‌లో కత్రినా, దీపికా నటించినా వాళ్లు లీడ్ రోల్స్‌లో సినిమా రాలేదు. కానీ అలియా సోలో లీడ్‌గా ఓ భారీ స్పై మూవీని YRF ప్లాన్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.
09.Kick 2
సల్మాన్ ఖాన్ హీరోగా 2014లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా కిక్. టాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచనలం సృష్టించింది. అయితే అప్పటి నుంచి సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్నా ఇంత వరకు వర్కవుట్ కాలేదు. కానీ తాజాగా కిక్ 2 విషయంలో క్లారిటీ వచ్చింది. కథ లాక్ అయ్యిందని త్వరలో సినిమా పట్టాలెక్కిస్తామని వెల్లడించారు దర్శకుడు సాజిద్ నదియడ్‌వాలా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...