Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP9 ET: 100 మిలియన్ల రికార్డ్‌.. ప్రభాస్ సొంతం.. | డే1 కలెక్షన్స్ మరీ అంతేనా..!

TOP9 ET: 100 మిలియన్ల రికార్డ్‌.. ప్రభాస్ సొంతం.. | డే1 కలెక్షన్స్ మరీ అంతేనా..!

Anil kumar poka

|

Updated on: May 13, 2023 | 7:26 PM

అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. ప్రభాస్‌ స్పిరిట్ నేమ్‌తో ఓ సినిమా వస్తోంది. డార్లింగ్ 25త్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా స్టోరీ అండ్ థీమ్‌ పై చిన్న క్లూ లీకైంది.

1.Prabhas
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. ప్రభాస్‌ స్పిరిట్ నేమ్‌తో ఓ సినిమా వస్తోంది. డార్లింగ్ 25త్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా స్టోరీ అండ్ థీమ్‌ పై చిన్న క్లూ లీకైంది. ఈ సినిమాలో ప్రభాస్ యాటిట్యూడ్‌ అర్జున్ రెడ్డి సినిమాలో vd యాటిట్యూడ్ కంటే 10 రెట్లు ఉంటుందనే లీక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.

02. Rules Ranjan
ఫలితాలతో సంబంధం లేకుండా వరస సినిమాలతో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణుకథతో పాటు మీటర్ లాంటి సినిమాలతో వచ్చారు. తాజాగా రూల్స్ రంజన్ అంటూ వస్తున్నారు. ఈ సినిమాలో డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి నాలో నేను లేను అనే పాట ప్రోమో రిలీజ్‌ అయింది. అందర్నీ అకట్టుకుంటోంది.

3. Anni Manchi
సంతోష్ శోభన్, మాళవిక నయ్యర్ జంటగా నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా అన్నీ మంచి శకునములే. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. సినిమాను కొత్తరకంగా ప్రమోట్ చేసుకుంటున్నారు మేకర్స్. మే 18న విడుదల కానుంది ఈ సినిమా. సీతారామం, మహానటి లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత స్వప్న సినిమా నుంచి వస్తున్న సినిమా కావడంతో అన్నీ మంచి శకునములేపై ఆసక్తి పెంచేస్తున్నాయి.

4. Parineeti Chopra
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య వరసగా పెళ్లి పీటలెక్కుతూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి ప్రియాంక చోప్రా చెల్లి పరిణీతి చోప్రా కూడా చేరిపోయారు. కొన్నాళ్లుగా ఈమె ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఢిల్లీలో చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ వేడుక ముగిసింది.

5. Parasuram
దర్శకుడు పరశురామ్ పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గీత గోవిందం, సర్కారు వారి పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తన కొత్త సినిమా మొదలు పెట్టడానికి ముందు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్ అని తెలిపారు. ఇప్పటికే రెండు స్క్రిప్టులు రెడీ చేసి అమ్మవారి దగ్గర పూజ చేయించానని చెప్పుకొచ్చారు. అందులో విజయ్‌ దేరకొండతో.. మరోటి కార్తీతో తెరకెక్కించనున్నట్లు.. లీక్ ఇచ్చారు ఈయన.

6. Newsence
నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుందిప్పుడు. దీనికి రెస్పాన్స్ బాగానే వస్తుంది. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్‌కు ఆహాలో స్పందన బాగుంది. మదనపల్లిలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్న ఈ వెబ్ సీరీస్ కథ ఆరు ఎపిసోడ్స్‌తో వచ్చింది. టైటిల్స్‌తోనే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసారు మేకర్స్. ఈ సిరీస్ అంతా 2000 ల కాలం నాటి కథతోనే సాగుతుంది. అప్పటి నేటివిటీకి తగినట్టుగా కెమెరా వర్క్ ఉంది.

7.Krithi
పుష్ప సినిమాలో సూపర్ డూపర్ హిట్టైన ‘ఊ అంటావా’ లాంటి సాంగ్స్‌ చేయాలని తాను ప్రస్తుతానికి అనుకోవడం లేదంటూ ఓ ఇంటర్య్వూలో చెప్పారు కృతి. ఆ సాంగ్స్ పై తనకు ఎలాంటి అవగాహన లేదని.. అందుకే ఇప్పుడే తాను అలాంటి సాంగ్స్‌ చేయాలనుకోవడం లేదన్నారు.

8.Custody
నాగచైతన్య హీరోగా.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య తాజాగా వచ్చిన కస్టడీ మూవీ.. డీసెంట్ హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకుంది. కానీ డే1 మాత్రం అనుకున్నంత కలెక్షన్స్‌ మాత్రం రాబట్టలేకపోయింది. ట్రేడ్‌ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం తొలిరోజు ఈ మూవీ దాదాపు 4 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో 2.5 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మాత్రం 23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

9.Adipurush
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ కాంట్రవర్సీ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపరుష్ ట్రైలర్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అన్ని రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ ను వచ్చేలా చేసుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!