TOP9 ET: భోళాపై తమిళ తంబీలు సీరియస్ | మహేష్ ధాటికి మోగిపోయిన సోషల్ మీడియా..
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి అదే చేసారీయన. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ సమక్షంలో పూర్తిగా న్యూ లుక్‌లోకి మారిపోయారు తారక్. దేవర కొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లోనే మొదలైంది. ఇందులోనే న్యూ లుక్‌లోకి వచ్చేసారు జూనియర్. ఈ షెడ్యూల్‌లో సైఫ్ అలీ ఖాన్ కూడా జాయిన్ అయ్యారు.
01.Meher Ramesh
వేదాళం సినిమా కథపై కామెంట్స్ చేసి తమిళ ఆడియన్స్‌కు అనుకోకుండా విలన్ అయిపోయారు మెహర్ రమేష్. వేదాళం సినిమా కథ క్రింజీగా ఉంటుందని.. దాన్ని మరో పదిరెట్లు బెటర్ చేసి భోళా శంకర్ చేసామంటూ మెహర్ చేసిన కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి. ఆయనపై ఆయన డైరెక్టర్ చేసిన ట్రోల్స్ చేసేలా చేశాయి. దీంతో రంగంలోకి దిగిన మెహర్ రమేష్ తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. తనకు అజిత్ అంటే ఇష్టమని.. వేదాళం విడుదలైనపుడే కథ బాగా నచ్చిందని చెప్పారు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం సంతోషంగా ఉందన్నారు మెహర్ రమేష్.
02.Mahesh
జెస్ట్ సింగిల్ లుక్‌తో… మాసు మరణానికి డెఫినేషన్గా మారిపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. గల్లా.. లుంగీ కట్టి.. బీడి ముక్క అంటుపెట్టి.. తనలోని ఊర మాసు యాంగిల్ ని తాజాగా చూపించేశారు. లుక్కిచ్చే కిక్కు ఎలా ఉంటుందో.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. అందరికీ విట్ నెస్ అయ్యేలా చేశారు. అదే లుక్‌తో.. అర్థ రాత్రి నుంచి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఆగకుండా అరిచేలా.. సెలబ్రేట్ చేసుకునేలా కూడా చేస్తూనే ఉన్నారు ఈ సూపర్ స్టార్.
03. Game Changer
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం మొదలైంది. ఇటీవల తండ్రి పోస్ట్‌కు ప్రమోట్ అవ్వటంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నారు చెర్రీ తిరిగి సెట్‌లో అడుగుపెట్టారు. ఆగస్టు 21 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
04.NTR Look
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి అదే చేసారీయన. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ సమక్షంలో పూర్తిగా న్యూ లుక్‌లోకి మారిపోయారు తారక్. దేవర కొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లోనే మొదలైంది. ఇందులోనే న్యూ లుక్‌లోకి వచ్చేసారు జూనియర్. ఈ షెడ్యూల్‌లో సైఫ్ అలీ ఖాన్ కూడా జాయిన్ అయ్యారు.
05.Kushi
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఖుషి’లో విజయ్, సమంత లుక్స్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 1న సినిమా విడుదల కానుంది.
06. SDT
బ్రో తర్వాత సినిమలాకు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఓ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దాని పేరు సత్య. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఆగస్ట్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. నవీన్ విజయ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఇందులో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించారు.
07.NC 23
నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాస్ నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఫిషర్ మెన్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం శ్రీకాకుళంలోని తీర ప్రాంతాల ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకున్నారు చైతూ అండ్ టీం. దీనికి సంబంధించిన వీడియో విడుదలైందిప్పుడు.
08.Bhagavan Kesari
యాక్షన్ సీన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి షూటింగ్ ప్రస్తుతం మారుడుమిల్లి ఫారెస్ట్‌లో జరుగుతోంది. ఈ వారంలోనే ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్‌లో జరగనుంది.
09.7G Brindavan
బ్లాక్ బస్టర్ మూవీ 7జీ బృందావన్ కాలనీ రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. 18 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీ మాస్టర్ చేసిన 4కే వర్షన్‌ను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...