TOP 9 ET: ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటోలు లీక్.
బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాగం కాబోతున్నాడు. వార్ 2 సినిమాలో ఇండియన్ స్పై హృతిక్‌ను ఢీకొట్టబోతున్నాడు. ఇక ఈక్రమంలోనే తారక్ లుక్ మీద.. ఓ చిన్న ఈగర్ అందర్లో ఉంది. ఇక ఆ ఈగర్‌ను కిల్ చేస్తూ.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఆ లుక్కే ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేస్తోంది.
01.allu Arjun: ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.
అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్ బిగ్ రిలీఫ్‌నిచ్చింది! నంద్యాల పోలీసులు పెట్టిన కేసేలో.. తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ.. పోలీసులను ఆదేశించింది. అంతేకాదు వచ్చేనెల 6వ తేదీన ఉత్తర్వులు ఇస్తామంటూ.. పేర్కొంది. ఇక ఏపీ ఎలక్షన్ టైంలో.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిని కలిసేందుకు బన్నీ ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ భారీగా బన్నీ ఫ్యాన్స్ గుమిగూడారు. అయితే ముందస్తు అనుమతలు లేకుండా.. ఎలక్షన్ టైంలో జనం గుమిగూడడంతో.. అందుకు కారణం అయిన శిల్పా రవి, బన్నీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసు విషయంగానే బన్నీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
02.war2: వార్ 2 నుంచి NTR ఫోటోలు లీక్
బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భాగం కాబోతున్నాడు. వార్ 2 సినిమాలో ఇండియన్ స్పై హృతిక్‌ను ఢీకొట్టబోతున్నాడు. ఇక ఈక్రమంలోనే తారక్ లుక్ మీద.. ఓ చిన్న ఈగర్ అందర్లో ఉంది. ఇక ఆ ఈగర్‌ను కిల్ చేస్తూ.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఆ లుక్కే ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేస్తోంది.
03.alia: ఆలియాకు పక్షవాతం.? క్లారిటీ..
ఆలియాకు పాక్షిత పక్షవాతం వచ్చిందంటూ.. కొన్ని రోజుల నుంచి ఓ న్యూస్ బీ టౌన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను చేయించుకున్న ఓ కాస్మోటిక్ సర్జరీ కారణంగా.. ఆలియాకు ఈ స్థితి వచ్చిందని.. అందుకే వంకరగా నడుస్తూ.. నవ్వుతోందంటూ.. ఓ న్యూస్ సర్కులేట్ అవుతోంది. అయితే ఈ వార్తలపైనే తాజాగా సీరియస్ అయింది ఆలియా..! ఎలాంటి ప్రూఫ్ లేకుండా.. కన్ఫర్మషన్ లేకుండా ఇలాంటి వార్తలను ఎందుకు రాస్తున్నారు.. స్ప్రెడ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా ఛానెల్స్ పై చిందులు తొక్కింది. క్లిక్ బేస్ .. అటెన్షన్ గెయిన్ టెక్నిక్స్ మానుకోవాలంటూ వాళ్లందరికీ సలహా ఇచ్చింది.
04.allu Arjun: అర్జున్- త్రివిక్రమ్ సినిమాపై బిగ్ అప్డేట్
ఓ పక్క పుష్ప2 మేనియా మెల్ల మెల్లగా వరల్డ్ వైడ్ పాకుతున్న వేళ.. బన్నీ- త్రివిక్రమ్ అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇప్పటి వరకు ఎవరూ చేయని.. చూడని విధంగా ఉంటుందంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ నుంచి ఓ మాట బటయటికి వచ్చింది. అంతేకాదు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని.. 2025 జనవరిలో ప్రోమోతో అనౌన్స్మెంట్ ఉంటుందంటూ.. మార్చ్ నుంచి షూటింగ్ మొదలవుతుందంటూ.. ఆయన చెప్పడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
05. nag: వీళ్లు కలిసింది పక్కకు పెడితే.. ఆ విషయం మాత్రం వైరల్ అవుతోంది.
అక్కినేని నాగేశ్వర రావు శతజయంతిని గ్రాండ్ గా నిర్వహించేందుకు కింగ్ నాగార్జున సిద్దమయ్యారు. అందుకోసం ఏకంగా ఇద్దరు మెగాస్టార్లను రంగంలోకి దించారు. ఎస్ ! టాలీవుడ్ మెగాస్టార్ చిరు..బాలీవుడ్ మెగాస్టార్ అబితాబ్ బచ్చన్‌ను.. ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేస్తున్నారు నాగ్. ఇక ఈక్రమంలోనే చిరును కలిసిన ఆయన.. మెగాస్టార్‌కు ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. అయితే ఈ ఇన్విటేషన్‌ను ఈవెంట్‌ను పక్కకు పెడితే.. ఆ ఫోటోలలో మెగాస్టార్ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చిరు చరణ్‌లా కనిపిస్తున్నాడంటూ.. నెట్టింట టాక్ వస్తోంది
06.jani master: బెయిల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ 1st ఇన్‌స్టా పోస్ట్
బెయిల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. బూల్ బులయ్యా3 సినిమా కోసం తాను కంపోజ్ చేసిన డ్యాన్స్ వీడియోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. అయితే జానీ ఇలా ఒక్కసారిగా ఇన్‌స్టా హ్యాండిల్లో యాక్టివ్ అవ్వడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
07.Mahesh: వేట మొదలైంది
మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులకు ఫుల్స్టాప్ పెట్టేశారు. లేటెస్ట్ గా లొకేషన్ల వేట మొదలుపెట్టారు డైరక్టర్ రాజమౌళి. జనవరిలో సినిమాను స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
08.Chinna: గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు చిన్న కథ.
35 చిన్న కథ కాదు సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. నవంబర్‌లో జరగనున్న గోవా ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. కేవలం 25 చిత్రాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం 35 చిన్న కథ కాదు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
09.arjun Kapoor: రూ.45 కోట్లు పెడితే.. రూ.50 వేల కలెక్షన్స్ అట్టర్ ప్లాప్ అంటే ఇదేనేమో.!
ఓ సినిమా హిట్టైతే.. హిట్టని.. ఫట్టైతే ఫట్టని అంటారు. అప్పుడప్పుడూ అట్లర్ ప్లాప్ అనే పదం కూడా వాడుతుంటారు. అయితే ఆ ఫెయిల్యూర్‌కు ఎలాంటి ప్రమాణాలు లేకుండానే కామెంట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమా ‘ది లేడీ కిల్లర్’ మాత్రం ఆ అట్టర్ ప్లాప్‌కు ప్రమాణంగా మారిపోయిందంటున్నారు కొంత మంది నెటిజన్స్ . ఎందుకంటే.. అర్జున్ కపూర్ , బూమి ఫడ్నేకర్ లీడ్ రోల్లో.. 45 కోట్ల బడ్జెట్‌తో.. ఎన్నో అంచనాల మధ్యన తెరకెక్కిన ది లేడీ కిల్లర్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం 50 వేలను మాత్రమే కలెక్ట్ చేసింది. అట్టర్ ప్లాప్ అనే ట్యాగ్ తో ఇప్పటికీ బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో వైరల్ అవుతోంది.
10. kanguva: అంత అనుభవం ఉండి.. నేను వెనకడుగు వేస్తే ఎలా.?
కంగువలాంటి భారీ కథలు చేయాల్సి వచ్చినప్పుడు భయం వేస్తుందన్నారు హీరో సూర్య. కానీ 27 ఏళ్ల అనుభవం ఉన్న తాను వెనకడుగు వేస్తే అర్థం ఉండదని చెప్పారు. ఇలాంటి కథలను కమర్షియల్‌గా కాకుండా, పేషన్‌తో చేయాలని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.