ఓ పక్క బాబాయ్ పవన్ కల్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో దూసుకుపోతున్న వేళ.. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదన్నారు. ఎన్నో ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే అని స్పష్టంచేశారు.