ఖమ్మం జిల్ల బోనకల్ మండల కేంద్రంలున్న గీ సాయిబాబా గుడి ముంగట బొచ్చెవట్కోని కూసోని భక్తులతాన అడుక్కుంటుండు సూడు.. గీ బిచ్చగాడు మామూలు బిచ్చగాడు కాదుల్లో.. నర్సింహరావ్ అనే ఒక బేవార్స్ బిజినెస్ మ్యాన్కే 50 వేలు మిత్తికిచ్చే రేంజు బిచ్చగాడట. పేరు గొల్లాల అశోకట.. ఎప్పటిసందో ఈ గుడి ముంగట ఇంటామెతోటి కల్శి అడుక్కతినుకుంట, అటు పక్కకే ఉండే గుడ్శెల బత్కుతుండట.