1000 Crores Movies: స్టార్ హీరోల సినిమాలు 1000 కోట్లు కొట్టాల్సిందేనా..? ఇంతకీ ఎవరా స్టార్ హీరోస్..
మా హీరో వస్తాడు 1000 కోట్లు కొడతాడు..! అరేయ్ మీ వాడి వల్ల ఏమవుతుందిరా మా వాడొచ్చి కొడతాడు చూడు..! ఇవన్నీ చూసాక హీరోల ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా..? మరీ ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాంరా అని..! టాలీవుడ్‌లో కొందరు హీరోల పరిస్థితి ఇదే.
బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది. మళ్లీ కేజియఫ్ 2తో యశ్.. ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించారు. బాలీవుడ్‌కు అందని ద్రాక్షలా ఉన్న 1000 కోట్ల మార్క్‌ను 2023లో పఠాన్‌తో అందుకుని చరిత్ర సృష్టించారు షారుక్ ఖాన్. దాంతో ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమాకు 1000 కోట్లు అనేది కామన్ టార్గెట్ అయిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ ఉందిగా.. పైగా ఓవర్సీస్ కూడా ఉంది.. మరింకేంటి 1000 కోట్లు వచ్చేస్తాయిలే అంటున్నారంతా. ఈ ప్రెజర్ ఎక్కువగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌పైనే పడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!