TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్‌

హీరోయిన్ దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం వస్తోంది. కల్కి సినిమాలో తమ డార్లింగ్ హీరోకు పెయిర్‌గా నటిస్తున్న దీపిక.. ఈ సినిమాను మాత్రం తన ఇన్‌స్టా పేజీల్లో కానీ.. ట్విట్టర్ హ్యండిల్లో కానీ.. ప్రమోట్ చేయడం లేదు. తను పాల్గొన్న ఈవెంట్స్‌లో కూడా.. కల్కి మూవీ గురించి మాట్లాడడం లేదు. దీంతో ఇది గమనించిన డార్లింగ్ ఫ్యాన్స్ దీపికని తప్పుబడుతున్నారు. ఇది పద్దతి కాదంటూ పోస్టులు పెడుతున్నారు.

TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్‌

|

Updated on: May 28, 2024 | 12:04 PM

హీరోయిన్ దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం వస్తోంది. కల్కి సినిమాలో తమ డార్లింగ్ హీరోకు పెయిర్‌గా నటిస్తున్న దీపిక.. ఈ సినిమాను మాత్రం తన ఇన్‌స్టా పేజీల్లో కానీ.. ట్విట్టర్ హ్యండిల్లో కానీ.. ప్రమోట్ చేయడం లేదు. తను పాల్గొన్న ఈవెంట్స్‌లో కూడా.. కల్కి మూవీ గురించి మాట్లాడడం లేదు. దీంతో ఇది గమనించిన డార్లింగ్ ఫ్యాన్స్ దీపికని తప్పుబడుతున్నారు. ఇది పద్దతి కాదంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె తీరును నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. బెంగుళూరు పోలీసులకు హేమ ఝలక్ ఇచ్చారు. విచారణకు హాజరవ్వకకుండా డుమ్మా కొట్టారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానంటూ… విచారణకు హాజరు కావడానికి తనకు ఇంకాస్త టైం కావాలంటూ.. సీపీబీ పోలీసులకు లేఖ రాశారు. అయితే ఈ లేఖను పరిగణలోకి తీసుకోని సీసీబీ పోలీసులు… హేమకు కొత్తగా నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నట్టు న్యూస్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌కు గౌతమ్ గంభీర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఈ సీజన్లో కేకేఆర్ కప్పు కొట్టడానికి కారణమైన గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చారట షారుఖ్‌. ఇంకో పదేళ్లు.. కేకేఆర్ జట్టు వెంటే మెంటార్‌గా ఉండి.. ఇలాంటి మరిన్ని విజయాలను తన జట్టుకు దక్కేలా చేయలాని కోరారట కూడా..! అయితే ఇంతకు ముందు గంభీర్ లఖ్‌నో జట్టుకు మెంటార్‌గా ఉందేవాడు. అక్కడి నుంచి తన జట్టులోకి తీసుకొచ్చేందుకు అప్పట్లో షారుఖ్‌ తీవ్రంగా శ్రమించాడు. ఆ సందర్భంగానే అవసరమైతే గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తా అంటూ చెప్పారు. ఇక ఇప్పుడు చెప్పినట్టే చేశారని బాలీవుడ్‌లో ఓ టాక్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్‌ను దారుణంగా చంపిన తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు

Aaradhyadevi: అందం వెనక ఆవేదనను, కష్టాన్ని చెప్పుకొని ఇన్‌స్టా బ్యూటీ ఎమోషనల్

Naa Anveshana: ఆటగాళ్ల మధ్య మాటల ముచ్చట.. మామూలుగా లేదుగా

Sobhita Dhulipala: నథింగ్ అనుకునేరు.. కోట్లలో సంపాదన ఈమెది

Follow us