Gautam Ghattamaneni: మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాన్వొకేషన్ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు గౌతమ్. తనయుడి ఎదుగుదలచూసి మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ తన స్పందన తెలియచేశారు. "నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాన్వొకేషన్ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు గౌతమ్. తనయుడి ఎదుగుదలచూసి మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ తన స్పందన తెలియచేశారు. “నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. నువ్వు విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్. తదుపరి అధ్యాయం నీ కోసం ఎదురుచూస్తోంది. అందులో కూడా నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతావని నాకు నమ్మకం ఉంది. నీ కలల సాకారం కోసం నిత్యం కృషి చేస్తూ ఉండు. ఎప్పటికీ నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. ఓ తండ్రిగా ఇవాళ నేను పుత్రోత్సాహంతో గర్విస్తున్నాను” అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
అంతేకాదు, తనయుడు గౌతమ్ కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరైనప్పటి ఫొటోలు కూడా పంచుకున్నారు. అందులో తల్లి నమ్రత, తండ్రి మహేష్, సోదరి సితారతో కలిసి తన గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు గౌతమ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

