Sobhita Dhulipala: నథింగ్ అనుకునేరు.. కోట్లలో సంపాదన ఈమెది
పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు శోభితా ధూలిపాళ సుపరిచితమే. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది శోభితా. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తార..
పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు శోభితా ధూలిపాళ సుపరిచితమే. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది శోభితా. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తార.. ఇప్పుడు సినీ రంగుల ప్రపంచంలో హీరోయిన్గా దూసుకుపోతోంది. ఈ ఏడాది దేవ్ పటేల్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి శోభితా అడుగుపెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పటికే నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని తనను తాను నిరూపించుకుంది. ఇక తన టీనేజ్‌లో ముంబయ్‌లో కార్పొరేట్ లా చదివిన శోభితా.. వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా ఎన్నికైంది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో విక్కీ కౌశల్ సరసన స్మృతికా నాయుడు పాత్రలో నటించింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన శోభితా.. ఆ తర్వాత సినిమాల్లో సక్సెస్ ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది మామూలు పక్షి ఈక కాదు.. 25 తులాల బంగారం కంటె ధర ఎక్కువ
ఇంటర్నెట్‌తో పన్లేదు, చార్జింగ్ అవసరం లేదు.. సింపుల్‌గా ఫోన్‌తోనే పేమెంట్స్
విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

