ఇంటర్నెట్‌తో పన్లేదు, చార్జింగ్ అవసరం లేదు.. సింపుల్‌గా ఫోన్‌తోనే పేమెంట్స్
డిజిటల్ పేమెంట్స్ ఓ విప్లవాత్మక విధానం అనుకుంటే, అందులోనూ సరికొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. నియో జాప్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇది ఒక ఎన్ ఎఫ్ సీ ట్యాగ్ డివైస్. చూడ్డానికి ఇదొక సిమ్ కార్డులా అనిపిస్తుంది. దీన్ని ఫోన్ వెనుక భాగంలో అతికించవచ్చు. ఫోన్ లో చార్జింగ్ అయిపోయినా సరే, ఈ నియో యాప్ డివైస్ సాయంతో సులభంగా యూపీఐ చెల్లింపులు జరపొచ్చు.
డిజిటల్ పేమెంట్స్ ఓ విప్లవాత్మక విధానం అనుకుంటే, అందులోనూ సరికొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. నియో జాప్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇది ఒక ఎన్ ఎఫ్ సీ ట్యాగ్ డివైస్. చూడ్డానికి ఇదొక సిమ్ కార్డులా అనిపిస్తుంది. దీన్ని ఫోన్ వెనుక భాగంలో అతికించవచ్చు. ఫోన్ లో చార్జింగ్ అయిపోయినా సరే, ఈ నియో యాప్ డివైస్ సాయంతో సులభంగా యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. ఎక్కడైనా సరే చెల్లింపు చేయాలంటే నియో జాప్ స్టిక్కర్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా పిన్ అవసరం లేకుండా చెల్లింపులు చేయొచ్చు. గరిష్ఠంగా 2 వేల రూపాయల వరకు పేమెంట్స్ జరిపేందుకు వీలుంది. ఈ నియో జాప్ పరికరాన్ని నియోఫినిటీ సంస్థ రూపొందించింది. దీంట్లో సెక్యూరిటీ పరంగానూ మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, హెచ్ డీఎఫ్ సీ ఎర్గో ఫ్రాడ్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. నియోఫినిటీ వెబ్ సైట్లో 33 రూపాయలు చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీని ధర 999 రూపాయలు. అయితే, ప్రీ బుకింగ్ చేసుకున్న మొదటి 1500 మంది కస్టమర్లకు ఈ నియో జాప్ డివైస్ ను 499 రూపాయలకే అందించనున్నారు. ఈ నియోజాప్ ఒక వర్చువల్ బ్యాంక్ కార్డులా పనిచేస్తుంది. వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులు బయటికి తీయాల్సిన పనిలేకుండానే చిన్నపాటి లావాదేవీలు జరపొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..
బాలుడికి ‘ఐరన్ మ్యాన్’ తరహా బయోనిక్ చెయ్యి
వేలమంది ప్రయాణీకుల ప్రాణాలతో లోకోపైలెట్ల చెలగాటం
రెండు దశాబ్దాల తర్వాత పూరి – నాగ్ కాంబినేషన్లో మరో సినిమా..
Lakshmi Manchu: ట్రోల్స్ చూసి బాధేసింది.. మంచు లక్ష్మీ ఎమోషనల్