ఇది మామూలు పక్షి ఈక‌ కాదు.. 25 తులాల బంగారం కంటె ధర ఎక్కువ

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి. వేటికవే తమ తమ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. పక్షి ఈకల్లో నెమలికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే నెమలి ఈకను మించిన ప్రత్యేకమైన ఈక ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎందుకంటే ఆ పక్షి ఈక ఖరీదు అక్షరాలా 23 లక్షల రూపాయలు. అంటే 25 తులాల బంగారం కంటే ఎక్కువ ఖరీదు.

ఇది మామూలు పక్షి ఈక‌ కాదు.. 25 తులాల బంగారం కంటె ధర ఎక్కువ

|

Updated on: May 27, 2024 | 9:02 PM

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి. వేటికవే తమ తమ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. పక్షి ఈకల్లో నెమలికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే నెమలి ఈకను మించిన ప్రత్యేకమైన ఈక ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎందుకంటే ఆ పక్షి ఈక ఖరీదు అక్షరాలా 23 లక్షల రూపాయలు. అంటే 25 తులాల బంగారం కంటే ఎక్కువ ఖరీదు. ఒక్క ఈకకు అంత ఖరీదు ఎందుకో తెలుసా? ఈ ఈక న్యూజిలాండ్‌ లో సంచరించే హుయియా పక్షికి చెందింది. ఆ పక్షి జాతి ఇప్పుడు అంతరించిపోయింది. ఎంతో అందమైన ఈ పక్షులను అందరూ ఇష్టపడేవారు. వాటి ఈకలు కూడా చూడటానికి చాలా అందంగా, ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఆ అంతరించిపోయిన పక్షికి సంబంధించిన ఓ ఈకను న్యూజిలాండ్‌కు చెందిన వెబ్ ఆక్షన్ హౌస్ ఈ నెల 20న వెబ్ వేలం వేసింది. 1.53 లక్షల రూపాయలను ఈ ఈకకు వేలం ధరగా నిర్ణయించింది. అయితే ఎవరూ ఊహించనంతంగా ఈ ఈకకు ఏకంగా 23 లక్షలకు పైగా ధర పలకడం అందరికీ షాక్ కలిగించింది. న్యూజిలాండ్‌లోని మవోరీ జాతి ప్రజలు హుయియా పక్షిని దైవంగా భావిస్తారు. ఆ తెగ పెద్దలు ఆ పక్షి ఈకలను తమ కిరీటాలలో ధరిస్తారు. అంతేకాదు ఈ ఈకలను అప్పట్లో అమ్ముకునే వారు కాదు. ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకునే వారు. అయితే ఆ పక్షులు క్రమంగా అంతరించి పోయాయి. చివరి సారిగా 1907లో ఓ హాయియా పక్షి కనిపించినట్టు రికార్డులను బట్టి తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్నెట్‌తో పన్లేదు, చార్జింగ్ అవసరం లేదు.. సింపుల్‌గా ఫోన్‌తోనే పేమెంట్స్

విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..

బాలుడికి ‘ఐరన్ మ్యాన్’ తరహా బయోనిక్ చెయ్యి

వేలమంది ప్రయాణీకుల ప్రాణాలతో లోకోపైలెట్ల చెలగాటం

రెండు దశాబ్దాల తర్వాత పూరి – నాగ్ కాంబినేషన్లో మరో సినిమా..

Follow us