Google Maps: మళ్లీ కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. కేరళలో నీటి ప్రవాహంలోకి కారు
తెలియని, కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో సాధారణంగా గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తారు. కాని ఒక్కోసారి తప్పు దారులను చూపించడంతో ప్రమాదాల బారిన పడ్డవారు చాలామందే ఉన్నారు. జీపీఎస్ కనెక్టివిటీ, సాంకేతిక లోపాల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశముంటుంది. అటువంటి సంఘటనే కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్లిన ఓ కారు సమీపంలోని నీటి ప్రవాహంలో మునిగిపోయింది.
తెలియని, కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో సాధారణంగా గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తారు. కాని ఒక్కోసారి తప్పు దారులను చూపించడంతో ప్రమాదాల బారిన పడ్డవారు చాలామందే ఉన్నారు. జీపీఎస్ కనెక్టివిటీ, సాంకేతిక లోపాల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశముంటుంది. అటువంటి సంఘటనే కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్లిన ఓ కారు సమీపంలోని నీటి ప్రవాహంలో మునిగిపోయింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యాటకులు కారులో మున్నార్ నుంచి అలప్పుజకు వెళుతున్నారు. వారు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ముందుకు సాగుతున్నారు. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో వారి కారు కురుప్పంతర పీర్ బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహంలో పడిపోయింది. ఈ వంతెన ఉన్న ప్రాంతంలో రెండు రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు నీటి ప్రవాహానికి సమాంతరంగా వెళుతోంది. మరో రోడ్డు అలప్పుజకు వెళుతుంది. అయితే గూగుల్ మ్యాప్స్ సాంకేతిక కారణాలతో వారికి అలప్పుజకు బదులు నీటి ప్రవాహంలోకి దారి చూపించిందని.. అది రాత్రిపూట కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారు నీటిలో మునిగిపోవడాన్ని స్థానికులు గమనించారు. స్థానికుల సహాయంతో పోలీస్ పెట్రోలింగ్ యూనిట్… లొపలున్న వారిని బయటకు తీసింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ కారులో మహిళతో సహా నలుగురు ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది మామూలు పక్షి ఈక కాదు.. 25 తులాల బంగారం కంటె ధర ఎక్కువ
ఇంటర్నెట్‌తో పన్లేదు, చార్జింగ్ అవసరం లేదు.. సింపుల్‌గా ఫోన్‌తోనే పేమెంట్స్
విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

