వాయిస్ మార్ఫింగ్ యాప్‌తో వల.. ఏడుగురిపై లైంగికదాడి
అతను ఓ నిరక్షరాస్యుడు, కానీ మహిళలపై అత్యాచారానికి హైటెక్ టెక్నాలజీని ఉపయోగించాడు. ఏడుగురు అమాయక గిరిజన కాలేజీ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాకు చెందిన బ్రజేష్ కుష్వాహా ఓ మాజీ మిల్లు కార్మికుడు. తన ప్రాంతంలో నివసించే అమాయక గిరిజన కాలేజీ విద్యార్థినులపై కన్నేసి ఓ భారీ ప్లాన్ వేశాడు.
అతను ఓ నిరక్షరాస్యుడు, కానీ మహిళలపై అత్యాచారానికి హైటెక్ టెక్నాలజీని ఉపయోగించాడు. ఏడుగురు అమాయక గిరిజన కాలేజీ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాకు చెందిన బ్రజేష్ కుష్వాహా ఓ మాజీ మిల్లు కార్మికుడు. తన ప్రాంతంలో నివసించే అమాయక గిరిజన కాలేజీ విద్యార్థినులపై కన్నేసి ఓ భారీ ప్లాన్ వేశాడు. వాయిస్ మార్ఫింగ్ యాప్ ఉపయోగించి తన స్వరాన్ని ఓ కాలేజీ మహిళా టీచర్ స్వరంలా మార్చి వారితో సెల్ ఫోన్లో మాట్లాడేవాడు. స్కాలర్ షిప్ ఇప్పిస్తానని.. ఇందుకోసం నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఓ వ్యక్తిని పంపిస్తానని.. అతను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తన (టీచర్) ఇంటికి తీసుకొస్తాడని నమ్మించేవాడు. అలా వారు బైక్ ఎక్కగానే సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి రేప్ చేసేవాడు. ఇప్పటివరకు అతను ఇలా ఏడుగురు యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. యువతులను కలిసేందుకు వెళ్లినప్పుడు నిందితుడు మొహం కనిపించకుండా హెల్మెట్ ధరించేవాడని అత్యాచార బాధితులు పోలీసులకు చెప్పారు. అయితే అతని చేతికి ఎప్పుడూ గ్లౌవ్స్ ఉండేవని వివరించారు. ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు కుష్వాహాను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఓ రోలింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చేతులు కాలిపోవడంతో అతను గ్లౌజ్ లు ధరించి తిరుగుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. మరోవైపు సిధి జిల్లా యంత్రాంగం అతని ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేసింది. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఐజీ మహేంద్ర సికార్ వర్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు
TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్
హీరోయిన్‌ను దారుణంగా చంపిన తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు
Aaradhyadevi: అందం వెనక ఆవేదనను, కష్టాన్ని చెప్పుకొని ఇన్‌స్టా బ్యూటీ ఎమోషనల్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

