Aaradhyadevi: అందం వెనక ఆవేదనను, కష్టాన్ని చెప్పుకొని ఇన్‌స్టా బ్యూటీ ఎమోషనల్

నెట్టింట రీల్స్ చేసి సినిమాల్లోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. ఇక ఒకే ఒక్క రీల్ వీడియోతో ఒక్కసారిగా నెట్టింట సెన్సెషన్ అయిన ముద్దుగుమ్మలు అనేక మంది ఉన్నారు. అందులో శ్రీలక్ష్మీ సతీష్ ఒకరు. ఆర్జీవీ ఆరాధ్య దేవి ఫేమస్ అయిన ఈ బ్యూటీ... ప్రస్తుతం ఆర్జీవీ శారీ సినిమాలో నటిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది.

Aaradhyadevi: అందం వెనక ఆవేదనను, కష్టాన్ని చెప్పుకొని ఇన్‌స్టా బ్యూటీ ఎమోషనల్

|

Updated on: May 28, 2024 | 12:01 PM

నెట్టింట రీల్స్ చేసి సినిమాల్లోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. ఇక ఒకే ఒక్క రీల్ వీడియోతో ఒక్కసారిగా నెట్టింట సెన్సెషన్ అయిన ముద్దుగుమ్మలు అనేక మంది ఉన్నారు. అందులో శ్రీలక్ష్మీ సతీష్ ఒకరు. ఆర్జీవీ ఆరాధ్య దేవి ఫేమస్ అయిన ఈ బ్యూటీ… ప్రస్తుతం ఆర్జీవీ శారీ సినిమాలో నటిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. తాజాగా ఇన్ స్టాలో చిట్ చాట్ నిర్వహించిన ఆరాధ్య దేవి.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఆమె కళ్లు, నడుము, వయసు గురించి పలు ప్రశ్నలు వేసిన నెటిజెన్స్‌కు ఓపిగ్గా ఆన్సర్ ఇచ్చింది. ఇక నీ ఏజ్ ఎంత అని ఓ నెటిజన్ అడగ్గా.. 22 అని చెప్పింది. కానీ ఈ విషయాన్ని ఎవరూ అంతగా నమ్మలేదు. అలాగే తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని.. ఇప్పుడు నేర్చుకుంటున్నాని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో శారీ మూవీ షూటింగ్ చేస్తున్నట్లు ఓ నెటిజన్‌ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది. ఇక తన హైట్ 5 ఫీట్స్ 8 ఇంచెస్ అని చెప్పింది. ఇక తన బాడీ కర్వ్స్ అంటే చాలా ఇష్టమని.. అదే తనలోని అందం అంటూ ఓ నెటిజన్ అనగా.. ఆ కర్వ్స్ అంత ఈజీగా రాలేదని.. ఎన్నో త్యాగాలు చేశానని చెప్పింది. ఎంతో వర్కౌట్ చేశానని.. ఎంతో కష్టపడితే వచ్చిందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తన మీద కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని.. అలాగే ట్రోలింగ్ కూడా చేశారని బాధపడింది. అలాగే తాను పొట్టి దుస్తుల్లో కంటే నిండుగా చీరకట్టులో కనిపిస్తే చాలా అందంగా ఉంటావ్ అని మరో నెటిజన్ అనగా.. తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని.. ఆవిడ ఎలాంటి దుస్తుల్లోనైనా అందరినీ ఆకట్టుకునేదని.. అలాగే తను కూడా అన్ని రకాల దుస్తుల్లో అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఆరాధ్య దేవి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naa Anveshana: ఆటగాళ్ల మధ్య మాటల ముచ్చట.. మామూలుగా లేదుగా

Sobhita Dhulipala: నథింగ్ అనుకునేరు.. కోట్లలో సంపాదన ఈమెది

Follow us