Naa Anveshana: ఆటగాళ్ల మధ్య మాటల ముచ్చట.. మామూలుగా లేదుగా
ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ..! ఇతని గురించి తెలియని వారు సోషల్ మీడియాలో ఉండరు. ప్రపంచ దేశాలు తిరుగుతూ.. అక్కడి ప్రదేశాలను, ప్రత్యేకతలను వివరిస్తూ యూట్యూబ్ లో బ్లాగ్స్ చేస్తున్నాడు అన్వేష్.. చాలా మందికి తెలియని విషయాలను తన వీడియోల ద్వారా తెలియజేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు. ఆటగాడు, సవక అనే పదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ..! ఇతని గురించి తెలియని వారు సోషల్ మీడియాలో ఉండరు. ప్రపంచ దేశాలు తిరుగుతూ.. అక్కడి ప్రదేశాలను, ప్రత్యేకతలను వివరిస్తూ యూట్యూబ్ లో బ్లాగ్స్ చేస్తున్నాడు అన్వేష్.. చాలా మందికి తెలియని విషయాలను తన వీడియోల ద్వారా తెలియజేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు. ఆటగాడు, సవక అనే పదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. విశాఖపట్టణానికి చెందిన యాసతో వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు అన్వేష్. తాజాగా అన్వేష్ ఓ సినిమాను ప్రమోట్ చేశాడు. సినిమాను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు గెటప్ శ్రీను. ఈ సినిమా గురించి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ఓ వీడియో చేశాడు. ఈ వీడియోలో గెటప్ శ్రీను పై ప్రశంసలు కురిపించాడు అన్వేష్. అయితే ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. “నేను గెటప్ శ్రీనుకు వీరాభిమానిని.. ఆయన కామెడీ స్కిట్స్ అన్ని చాలా ఇష్టం నాకు. కమల్ హాసన్ ఎలా అయితే యాక్టింగ్ లో ఇరగదీస్తారో కామెడీలో గెటప్ శ్రీను కూడా అలా చేయగలరు. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో వస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఒక వీరాభిమానిగా ఈ సినిమాను అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. మీరు మరిన్ని కామెడీ సినిమాలు తీసి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు యూరప్ ఖండంనుంచి” అని వీడియోలో చెప్పుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

