Subbulakshmi: సౌత్ ఇండస్ట్రీలో విషాదం.. మరో సీనియర్ నటి మృతి.!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి తనదైన ముద్ర వేసుకున్న నటి ఆర్.సుబ్బలక్ష్మి గురువారం కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. 87 సంవత్సరాల సుబ్బలక్ష్మి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి తనదైన ముద్ర వేసుకున్న నటి ఆర్.సుబ్బలక్ష్మి గురువారం కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. 87 సంవత్సరాల సుబ్బలక్ష్మి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్టు ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుబ్బలక్ష్మి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. దాదాపు 75 సినిమాల్లో నటించిన సుబ్బలక్ష్మి, అనేక సీరియళ్లలోనూ, ఎన్నో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు సుబ్బలక్ష్మి. ఆల్ ఇండియా రేడియోలోనూ సేవలందించారు. అంతేకాదు, రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నూ సుబ్బలక్ష్మి తన సేవలు అందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.