‘నీ పంచె జేబులో పెట్టుకో..’ గరికపాటిపై ఆర్జీవీ ఘోరమైన ట్వీట్

Phani CH

Phani CH |

Updated on: Oct 12, 2022 | 9:39 AM

గరికాపటి పై ఆర్జీవీ చేసిన ఘోరమైన ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది టాలీవుడ్ అవుతున్నాయి. చిరుకు, చిరు ఫ్యాన్స్ కు మద్దతుగా.. ఆయన గరికపాటిని ఉద్దేశిస్తూ వాడిన పదాలు..

గరికాపటి పై ఆర్జీవీ చేసిన ఘోరమైన ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది టాలీవుడ్ అవుతున్నాయి. చిరుకు, చిరు ఫ్యాన్స్ కు మద్దతుగా.. ఆయన గరికపాటిని ఉద్దేశిస్తూ వాడిన పదాలు.. అందర్నీ అవాక్కయేలా చేస్తున్నాయి. “హే గూగురుపాటి నరసింహ రావు, తమరు గడ్డిపరిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి” అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట పెద్ద దూమారం రేపుతోంది. ఆర్జీవీకి వ్యతిరేకంగా కామెంట్లు వచ్చేలా చేస్తోంది. అంత పెద్దాయనను అలా అనడం ఏంటనే విమర్శ అంతటా వినిపిస్తోంది. అంతే కాదు ఈ ట్వీట్తో పాటు.. నాగబాబుకు మరో ట్వీట్ చేశారు ఆర్జీవీ. ” సర్ నాగబాబు గారు.. మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గడ్డిపరిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు.” అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. అంతేకాదు ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ అంటూ …ప్లేటు ఫిరాయించినట్టు.. నాగబాబును చిరును ప్రశ్నించారు వర్మ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: నయనతారకు కవలలు పుడతారని NTR ఎప్పుడో చెప్పారు..

ఇండియాను షేక్ చేస్తున్న కాంతారా.. న్యూ కాన్సెప్ట్‌ .. మైండ్‌ బ్లోయింగ్

ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా.. వీడియో వైర‌ల్

గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu