5

ఇండియాను షేక్ చేస్తున్న కాంతారా.. న్యూ కాన్సెప్ట్‌ .. మైండ్‌ బ్లోయింగ్

కాంతారా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది.

|

Updated on: Oct 11, 2022 | 9:49 AM

కాంతారా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. మొదటి ఆట తోనే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతూ దర్శకనిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అందుకే ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్‌ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్‌కు ముహూర్తం నిర్ణయించారు. కాంతారా తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ని ప్రముఖ అల్లు అరవింద్‌ సొంతం చేసుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అక్టోబరు 15న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక కాంతారా అనేది ఓ సంస్కృత పదం. తెలుగులో అడవి అని అర్థం వస్తుంది. అడవిపై మనం ఎంత ప్రేమను చూపిస్తే అంతకుమించిన ప్రేమను అందిస్తుంది.. ఎంత విద్వేషం చూపితే అంతకు మించిన విధ్వంసం జరుగుతుందన్న కాన్సెప్ట్‌తో ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను స్వయంగా తీర్చిదిద్దాడు రిషబ్‌. అంతేకాదు హీరోగాను నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా.. వీడియో వైర‌ల్

గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!

తండ్రి ఫోటోతో పెండ్లి మంట‌పంలోకి వ‌ధువు ఎంట్రీ !!

వృద్ధుడి సల్సా !! కిల్లర్ మూవ్స్‌తో అద‌ర‌గొట్టాడుగా..

 

Follow us