గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

Phani CH

|

Updated on: Oct 11, 2022 | 9:46 AM

ఓ డాక్టరమ్మ తన గొప్ప మనసును చాటుకుంది. తాను చదువుకున్న వైద్య కళాశాలకు భారీ విరాళంగా ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఓ డాక్టరమ్మ తన గొప్ప మనసును చాటుకుంది. తాను చదువుకున్న వైద్య కళాశాలకు భారీ విరాళంగా ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్‌ గవిని వెంకటకృష్ణారావు రెండో కుమార్తె డాక్టర్‌ ఉమ గవిని. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. అమెరికాలో 40 ఏళ్ల కిందట స్థిరపడి, ఇమ్యునాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం భర్త మృతి చెందారు. పిల్లలు లేరు.. దీంతో తన యావదాస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. ఉమా 1965లో గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసించారు. ఇటీవల గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికాకు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం జింఖానా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!

తండ్రి ఫోటోతో పెండ్లి మంట‌పంలోకి వ‌ధువు ఎంట్రీ !!

వృద్ధుడి సల్సా !! కిల్లర్ మూవ్స్‌తో అద‌ర‌గొట్టాడుగా..

వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ భార్య భర్తలు

Naga Chaitanya: నాగచైతన్య సినిమాకు షాకిచ్చిన ప్రభుత్వం

 

Published on: Oct 11, 2022 09:46 AM