'అన్న బాటలోనే వదిన' న్యూఇయర్ వేళ.. అనాథ పిల్లల సేవ..

‘అన్న బాటలోనే వదిన’ న్యూఇయర్ వేళ.. అనాథ పిల్లల సేవ..

Phani CH

|

Updated on: Jan 03, 2024 | 12:28 PM

పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పగానే సినిమాల కంటే ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఆపదలో ఉన్నవారికి ఎలాంటి సాయమైనా కాదనకుండా చేస్తారాయన. ఇప్పుడు జనసేన పార్టీని స్థాపనతో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు పవర్‌ స్టార్‌. ఇక అందుకే అన్నట్టు.. ఆయన చేసే సేవా కార్యక్రమాలను చేస్తున్నా పవన్‌ భార్య అన్నా కొణిదెల. ఇటీవల ఓ అనాథ శరణాలయంలో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొన్నారామె.

పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పగానే సినిమాల కంటే ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఆపదలో ఉన్నవారికి ఎలాంటి సాయమైనా కాదనకుండా చేస్తారాయన. ఇప్పుడు జనసేన పార్టీని స్థాపనతో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు పవర్‌ స్టార్‌. ఇక అందుకే అన్నట్టు.. ఆయన చేసే సేవా కార్యక్రమాలను చేస్తున్నా పవన్‌ భార్య అన్నా కొణిదెల. ఇటీవల ఓ అనాథ శరణాలయంలో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొన్నారామె. ఆ సమయంలో చిన్నారులకు అవసరమైన నిత్యావసర సరుకులను కూడా విరాళంగా అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు అనా కొణిదెల. అందరూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటే పవన్ సతీమణి మాత్రం అనాథ బాలికలతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ శివారు.. ఘట్‌ కేసర్‌ పరిధిలోని.. నారపల్లి లో ఉన్న ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ అనాథ శరణాలయానికి వెళ్లిన అనా… అక్కడి చిన్నారులతో కలిసి కేట్‌ కట్‌ చేశారు. పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులను, సామాగ్రిని విరాళంగా అందజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..

కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం

పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు

Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.

ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు