భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..

భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..

Phani CH

|

Updated on: Jan 01, 2024 | 3:17 PM

అమెరికాలోని కాలిఫోర్నియా తీరాన్ని సునామీ తరహాలో రాకాసి అలలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పసిఫిక్‌ మహా సముద్రం అలజడిగా మారడంతో భారీ అలలు విరుచుకుపడుతున్నాయి. రాకాసి అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంచూరా ప్రాంతంలో రాకాసి అల తీరాన్ని బలంగా తాకడంతో స్థానికంగా ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు.

అమెరికాలోని కాలిఫోర్నియా తీరాన్ని సునామీ తరహాలో రాకాసి అలలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పసిఫిక్‌ మహా సముద్రం అలజడిగా మారడంతో భారీ అలలు విరుచుకుపడుతున్నాయి. రాకాసి అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంచూరా ప్రాంతంలో రాకాసి అల తీరాన్ని బలంగా తాకడంతో స్థానికంగా ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. సముద్ర తీరంలో ఉన్న సంచరిస్తున్నవారు మొదట రాకాసి అలను సాధారణంగా భావించారు. కానీ అల తీరాన్ని సమీపించే కొద్దీ దాని తీవ్రతను గుర్తించిన వారు పరుగందుకున్నారు. వేగంగా దూసుకొచ్చిన అల వారిని వెంబడించింది. కాలిఫోర్నియాలోని మారిన్‌ కౌంటీతో పాటు క్యాపిటోలా గ్రామంలోని ప్రజలను అక్కడినుంచి తరలివెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. రాకాసి అలలు ఒక్కొక్కటి 28 నుంచి 40 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయని నేషనల్‌ వెదర్‌ సర్వీసు కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు రావొచ్చని హెచ్చరించింది. సాన్‌డియాగో ప్రాంతంలో అత్యంత భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఉండే రాళ్లు, జెట్టీలు, పియర్స్‌ లాంటివాటిపై ఎవరూ ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం

పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు

Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.

ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు

మత్స్యకారుల పంటపండింది.. వలలో పడ్డ అతిపెద్ద చేప..