Jallikattu: కొత్త సంవత్సరాదిన చంద్రగిరిలో జల్లికట్టు సంబరాలు.. యువకులకు గాయాలు- Watch Video

Jallikattu: కొత్త సంవత్సరాదిన చంద్రగిరిలో జల్లికట్టు సంబరాలు.. యువకులకు గాయాలు- Watch Video

Raju M P R

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 01, 2024 | 3:27 PM

Jallikattu Video: కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం మొదటి రోజున జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ శానంబట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు.

తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభం అయింది. కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం మొదటి రోజున జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ శానంబట్ల గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. దున్నలకు రాజకీయ పార్టీల జెండాలు, అభిమాన హీరోలు, నాయకుల ఫొటోలు పెట్టి బరిలోకి దించారు. ఎద్దులను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఎద్దులను నిలువరించే క్రమంలో పలువురు యువకులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. జల్లికట్టును తలికించేందుకు చంద్రగిరి మండలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి యువకులు తరలివచ్చారు.