Mrunal Thakur: దుల్కర్ అలా వెళుతుంటే నా గుండె బద్ధలైంది.! మృణాల్ వీడియో.

Mrunal Thakur: దుల్కర్ అలా వెళుతుంటే నా గుండె బద్ధలైంది.! మృణాల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 14, 2024 | 8:36 PM

మృణాల్ ఠాకూర్! హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. టాలీవుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది మృణాల్. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

మృణాల్ ఠాకూర్! హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. టాలీవుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది మృణాల్. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సీతారామం తర్వాత తెలుగులో మృణాల్ కు అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే ఇప్పటికీ ఆమెను సీతారామం బ్యూటీ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. ఇక తనకు ఇష్టమైన సినిమా సీతారామం అని.. సీతామహాలక్ష్మి పాత్ర తన కెరీర్ లోనే అత్యంత గొప్ప రోల్ అంటుంది మృణాల్. అనడమే కాదు.. ఈ సినిమాలో తన కోస్టార్ దుల్కర్ యాక్టింగ్ విషయంలో ఎంతో సాయం చేశాడని.. తను షూటింగ్ నుంచి వెళుతుంటే ఎమోషల్ అయినట్టు చెప్పారు.

“తెలుగులో నేను చేసిన మొదటి సినిమా సీతారామం. ఆ సమయంలో నాకు ఏమి చేయాలో తెలియదు. ఇప్పుడే నాకు దుల్కర్ సల్మాన్ ఎంతో సహకారం అందించాడు. ఎప్పటికీ అతడే నా మార్గదర్శి. సీతామహాలక్ష్మి పాత్ర నుంచి ముందుకు వెళ్లడం చాలా కష్టంగా అనిపించింది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలియగానే గుండె బద్దలైనట్లు అనిపించిచంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా మారిపోతా. అలా నటించిందే సీతామహాలక్ష్మి. ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎంతో కష్టంగా అనిపించింది. షూటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు గుండె భారంగా అనిపించింది. ఆ పాత్రలను నేను ఎంతో ప్రేమించాను. వాటిని తిరిగి ఎప్పటికీ చేయలేనేమో. ఇది నిజంగా హార్ట్ బ్రేక్ ” అని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..