ప్రభాస్ 'ప్రాజెక్టు కె'లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??

ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??

Phani CH

|

Updated on: Jun 02, 2023 | 9:43 AM

ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొణె .. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' సినిమా కోసం.. ప్రముఖ నటుడు కమలహాసన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ విరోధి పాత్రకు కమలహాసన్ ను తీసుకోవాలనే యోచనతో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.

ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొణె .. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కోసం.. ప్రముఖ నటుడు కమలహాసన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ విరోధి పాత్రకు కమలహాసన్ ను తీసుకోవాలనే యోచనతో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. నిర్మాత అశ్వనీదత్ ఏకంగా రూ.150 కోట్ల ఆఫర్ ను కమలహాసన్ కు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కమలహాసన్ ను సంప్రదించిన మాట నిజమే కానీ, రూ.150 కోట్ల రెమ్యునరేషన్ వార్తలు మాత్రం నిజం కావని సినిమా వర్గాలు వెల్లడించాయి. కమలహాసన్ తో చర్చలు మొదలయ్యాయని, ఇంకా కమల్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. కమల్ తన నిర్ణయం చెప్పేందుకు మరో ఒకటి రెండు వారాల సమయం పట్టొచ్చని ప్రాజెక్ట్ కె సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె పాత్రలకు సంబంధించి మరో 10 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుందని సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డిప్లొమా కంప్లీట్‌ చేసిన శునకం..ఎక్కడంటే ??

ఈ కోతి మహా చిలిపి.. ఏం చేసిందో చూస్తే నవ్వాగదు

బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..

ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!

విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్‌ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??