విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
సౌత్ కొరియాలోని ఓ విమానం గాల్లో ఎగురుతుండగానే దాని డోర్ తెరుచుకోవడం కలకలం రేపింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఏసియనా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321 విమానం సౌత్ కొరియాలోని డేగు పట్టణం నుంచి జెజు ద్వీపానికి వెళ్తోంది. దాదాపు 194 మంది ప్రయాణికులు ఆ విమానంలో..
సౌత్ కొరియాలోని ఓ విమానం గాల్లో ఎగురుతుండగానే దాని డోర్ తెరుచుకోవడం కలకలం రేపింది. ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఏసియనా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321 విమానం సౌత్ కొరియాలోని డేగు పట్టణం నుంచి జెజు ద్వీపానికి వెళ్తోంది. దాదాపు 194 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే డేగు నుంచి జెజుకు చేరుకోవడానికి ఆ ఫ్లైట్‌కు గంట సమయం పడుతుంది. అయితే అది గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడం చర్చనీయాంశమైంది. అందులో ఉన్న ప్రయాణికులు అతడ్ని డోర్ తెరవకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ డోర్‌ను అతను తెరిచాడు. దీంతో ఒక్కసారిగా బలమైన గాలులు ఫ్లైట్‌లోకి దూసుకురావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎట్టకేలకు విమానం ల్యాండ్ అయ్యాక అధికారులు ఆ డోర్ తెరిచిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతను ఎందుకు అలా తెరిచాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??
Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ
Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్
రామ్ చరణ్‌తో విభేదాలు లేవు.. అంటూనే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
SSMB28: గూబ గుయ్‌మనేలా.. గుంటూరోడి కారం.. ఇక బొమ్మ దద్దరిల్సిందే
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

