విక్రమార్కుడు సీక్వెల్‌లో రష్మిక మందన్న.. హీరో ఎవరో తెలుసా ??
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమైకైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ రీమేక్ మూవీ 2012 ఏడాదిలో హయ్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీగా నిలిచింది.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమైకైంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ రీమేక్ మూవీ 2012 ఏడాదిలో హయ్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీగా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రౌడీ రాథోడ్‌కు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతోన్నట్లు టాక్. ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ స్థానంలో షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా రష్మిక మందన్నను ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రష్మిక కూడా ఈ సీక్వెల్ కోసం డేట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు. రౌడీ రాథోడ్ ఫస్ట్ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సీక్వెల్‌ను తెరకెక్కించే బాధ్యతను అతడి స్థానంలో అనీస్ బజ్మీ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రౌడీ రాథోడ్ -2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినట్లు తెలిసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సీక్వెల్‌కు బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’లో కమలహాసన్ ?? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత ??