బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..

బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..

Phani CH

|

Updated on: Jun 01, 2023 | 5:11 PM

పాములతో జర భద్రం …! అసలే సమ్మర్ సీజన్. వేసవి తాపానికి అవి వనాల్లోంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. కాటు పడిందంటే.. పెను ప్రమాదం తప్పదు. ఎక్కువగా మరుగు ఉన్న ప్రాంతాల్లో అవి నక్కి ఉంటాయి. అదే విధంగా మీరు షూస్ వేసుకునే ముందు.. ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తే బెటర్.

పాములతో జర భద్రం …! అసలే సమ్మర్ సీజన్. వేసవి తాపానికి అవి వనాల్లోంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. కాటు పడిందంటే.. పెను ప్రమాదం తప్పదు. ఎక్కువగా మరుగు ఉన్న ప్రాంతాల్లో అవి నక్కి ఉంటాయి. అదే విధంగా మీరు షూస్ వేసుకునే ముందు.. ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తే బెటర్. ఎందుకంటే.. ఈమధ్య ప్రమాదకర పాములు బూట్లలో నక్కుతున్నాయి. అమెరికా లూసియానాలోని బాటన్ రూజ్‌కు చెందిన జెఫ్రీ టక్కర్ ఇటీవల తన క్రాక్స్‌లో విషపూరిత వాటర్ మొకాసిన్ పామును గుర్తించి కంగుతిన్నాడు. దాదాపుగా అడుగుపెట్టే సమయంలో దాన్ని గుర్తించానని.. సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపాడు. ”పనిమీద బయటకు వెళ్తూ, నా షూ డాబాపై ఉండటంతో వేసుకుందామని అక్కడికి వెళ్లాను. షూవేసుకుందామని కాలు పెట్టబోయాను. అంతలో ఓ పాము షూలోనుంచి తన తలను బయటకు పెడుతూ పైకి లేచింది. దీంతో వెనక్కు పరుగులు తీశాను. అది పాము పిల్ల. కేవలం ఒక అడుగు పొడవు మాత్రమే ఉంది. కానీ అది చాలా డేంజర్. మా ఇంట్లో అప్పుడప్పుడు కప్పలు కనబడుతూ ఉంటాయి. కానీ పాము కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్.” అని జెఫ్రీ తెలిపాడు. కాగా వాటర్ మొకాసిన్ పామును కాటన్‌మౌత్ అనే పేరుతో పిలుస్తారు. పాము నోటి లోపలి భాగంలో ఉన్న తెల్లని రంగు కారణంగా అలా పిలుస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!

విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్‌ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??

Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ

Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్‌