Bigg Boss 7: బిగ్ పంచ్‌..! మొదలవ్వనే లేదు.. అప్పుడే కోర్టు కేసు..!

| Edited By: TV9 Telugu

Aug 09, 2023 | 6:42 PM

మన్మథుడు సినిమాలో నాగార్జున చెప్పినట్టు.. వర్షాకాలంలో బురదలా.. ఎండాకాలంలో చెమటలా.. చలి కాలంలో జలుబులా.. బిగ్ బాస్ సీజన్లో వివాదాలకు అడ్డాగా మారుతూనే ఉంటుంది. వద్దన్నా.. కాదన్నా.. కొంత మంది మనోభావాలను దెబ్బతీస్తుంది. కోర్టుకెక్కి ఈ షోను ఆపాలని పిటిషన్ వేసలా చేస్తుంది..

మన్మథుడు సినిమాలో నాగార్జున చెప్పినట్టు.. వర్షాకాలంలో బురదలా.. ఎండాకాలంలో చెమటలా.. చలి కాలంలో జలుబులా.. బిగ్ బాస్ సీజన్లో వివాదాలకు అడ్డాగా మారుతూనే ఉంటుంది. వద్దన్నా.. కాదన్నా.. కొంత మంది మనోభావాలను దెబ్బతీస్తుంది. కోర్టుకెక్కి ఈ షోను ఆపాలని పిటిషన్ వేసలా చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త డిఫరెంట్‌గా… సీజన్ 6లో ఈ షోకు వ్యతిరేకంగా వేసిన ఓ పిటిషన్‌ అసలు సీజనే మొదలు కానీ.. బిగ్ బాస్ 7కు చుట్టుకుని తల పట్టుకునేలా చేస్తోంది. ఎస్ ! బిగ్ బాస్ సీజన్‌ 6 యావరేజ్‌ రేటింగ్ తర్వాత ఈ సారి బిగ్ బాస్ సీజన్‌ 7తో రికార్డ్‌ లెవల్‌ రేటింగ్‌ పట్టాలనే ఆలోచనలో తాజాగా బరిలో దిగారు ఈ షో మేకర్స్. హోస్ట్ గా నాగార్జుననే ఫిక్స్ చేసి కుడిఎడమైతే అనే న్యూ థీమ్‌ తో.. కాన్సెప్ట్ తో ఈసారి అందర్నీ ఎంటర్ టైన్ చేయాలనుకున్నారు. కానీ షో మొదలవక ముందే.. ఆదిలోనే కోర్టు ముంగిట నిలబడే వరకు వచ్చారు.

ఇక అసలు విషయం ఏంటంటే.. గతంలో సీజన్‌ 6 పై… ఓ వ్యక్తి ఏపీ హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. ఈ షోను అశ్లీలత, అసభ్యత ఈ షోలో ఎక్కువయ్యాయని.. అందుచేత ఈ షోను తక్షణే నిలిపేసేలా తీర్పునివ్వాలని కోర్టును అభ్యర్థించారు. అయితే అప్పట్లో వాయిదా పడిన ఆ పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది. దీంతో తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు తాజాగా నాగార్జున తో పాటు..ఈ షో టెలీకాస్ట్ అవుతున్న ఛానెల్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని షో మేకర్స్‌ను ఆదేశించింది. దాంతో పాటే.. విచారణను 4 వారాలకు వాయిదా చేసింది. దీంతో ఈ షో మొదలవకుండానే కోర్టు ముంగిట నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే ఇప్పుడు టెలివిజన్‌ సర్కిల్లో హాట్ టాపిక్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...