Actress Shobana: నటి శోభన మంచిమనసు.. దొంగతనం చేసారు అని తెలిసి కూడా అలా ఎలా..?
ప్రముఖ సినీ నటి శోభనకు నటిగానే కాకుండా, క్లాసికల్ డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. వివిధ భాషల్లో పలు సినిమాల్లో నటించిన శోభన తెలుగులోనూ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ సినీ నటి శోభనకు నటిగానే కాకుండా, క్లాసికల్ డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. వివిధ భాషల్లో పలు సినిమాల్లో నటించిన శోభన తెలుగులోనూ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తేనాంపేట శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి ఆమె నివసిస్తున్నారు శోభన. కడలూర్ జిల్లా కోవిల్ కు చెందిన విజయ అనే మహిళను ఏడాది క్రితం ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారు.
విజయ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు డబ్బులు మాయం అవుతుండటంతో, శోభనకు అనుమానం వచ్చి తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శోభన ఫిర్యాదుతో విజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది విజయ. గత మార్చ్ నుంచి ఇప్పటి వరకు 41,000 రూపాయలు చోరీ చేశానని పోలీసులకు తెలిపింది. పేదరికం కారణంగానే తాను ఈ తప్పు చేశానని, తనను క్షమించాలని శోభనను విజయ ప్రాధేయపడింది. ఆమె దీన స్థితికి కరిగిపోయిన శోభన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడమే కాకుండా, విజయను మళ్లీ తన ఇంట్లోనే పని చేయడానికి అనుమతించారు.
మరిన్ని వీడియోస్ కోసం: Videos Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..! Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...