Chiranjeevi: చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..! లార్జెస్ట్..
తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్సీ ఏదైనా చేస్తారు. అందులోనూ చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఆ లెవలే వేరు.. తగ్గేదే లే అంటూ.. సినిమా చరిత్రలోనే అతిపెద్ద.. అభిమాన హీరో చిరంజీవి కటౌట్‌ను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు.
తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్సీ ఏదైనా చేస్తారు. అందులోనూ చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఆ లెవలే వేరు.. తగ్గేదే లే అంటూ.. సినిమా చరిత్రలోనే అతిపెద్ద.. అభిమాన హీరో చిరంజీవి కటౌట్‌ను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద ఓ భారీ కటౌట్ వాహనదారులను ఆకర్షిస్తోంది. వచ్చిపోయే వారంతా ఈ భారీ కటౌట్‌ను ఆగి చూసి మరీ వెళ్తున్నారు. భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి అభిమానులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే జాతీయ రహదారి పక్కన రాజుగారి తోట రెస్టారెంట్ సమీపంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్దగా 120 అడుగుల కటౌట్ ప్లాన్ ఏర్పాటు చేసినట్లు అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రసిడెంట్ బైరు వెంకన్న గౌడ్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం: Videos Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..! Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...