AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది

పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 1:39 PM

Share

సినిమా పైరసీపై పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. టిక్కెట్, క్యాంటీన్ ధరలు అధికంగా ఉండటం వల్లే పైరసీకి జనం మొగ్గు చూపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు తగ్గితే థియేటర్లకు ఫుట్‌ఫాల్ పెరిగి, కలెక్షన్లు మెరుగుపడతాయని, పైరసీని అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు. పరిశ్రమ ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని సరైన చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పైరసీ గురించి చర్చించని సినిమాగల్లీలే లేవిప్పుడు. పైరసీ భూతాన్ని అరికట్టే రోజులు వచ్చేశాయా? పైరసీ లేకపోతే కలెక్షన్లు పెరుగుతాయా? అంటూ రకరకాల చర్చలు… ఇక థియేటర్లలో ఫుట్‌ఫాల్ పెరుగుతుందా? అనే టాపిక్‌ ట్రెండింగ్‌ ఇప్పుడు. ఇంతకీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? తెలుసుకున్న తప్పులను పెద్దలు సరిదిద్దుకుంటారా? షరామామూలే అన్నట్టు కానిచ్చేస్తారా? చూసేద్దాం పదండి… పైరసీ ఇష్యూ వార్తల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇండస్ట్రీ తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చ గట్టిగా జరుగుతోంది. ముందు టిక్కెట్‌రేట్లను తగ్గించండి.. తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడుకుందాం అంటున్నారు జనాలు. టిక్కెట్‌, క్యాంటీన్‌రేట్లు అందుబాటులోకి వస్తే…పైరసీ చూడాల్సిన ఖర్మ మాకేంపట్టిందనే మాటలు సోషల్‌ మీడియాలో గట్టిగానే వైరల్‌ అవుతున్నాయి. సినిమా వాళ్ల కష్టాన్ని దోచుకునేవారిని ఎన్‌కౌంటర్‌ చేసి పడేయాలి. మామూలు శిక్షలు సరిపోవన్నది సి.కల్యాణ్‌ మాట. బయటి నుంచి పైరసీ జరిగే మాట సరే… క్యూబ్‌, యుఎఫ్‌ఓల ద్వారానే లీకేజులు జరుగుతున్నాయన్నది మరికొందరి వాదన. ఇక్కడ జాగ్రత్త తీసుకోకుండా ఎవరినో అనడం ఏంటన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. టిక్కెట్ రేట్లు, క్యాంటీన్‌రేట్లు అందుబాటులోకి వస్తే థియేటర్లకు ఫుట్‌ఫాల్‌ పెరుగుతుంది. దాని వల్ల కలెక్షన్లు నిండుగా కనిపిస్తాయి. కొద్ది పాటి శ్రద్ధ పెట్టి, ఈ మధ్యకాలంలో పైరసీ నేర్పిన గుణపాఠాన్ని ఆలకించి, చర్చించి, మార్గాలను అన్వేషించి అమలు చేస్తే అంతా మంచే జరుగుతుందన్నది అనుభవజ్ఞుల మాట. ఇంతకీ ఇండస్ట్రీ ఈ మాటలు వింటున్నట్టేనా?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్తాద్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!

ఆంధ్రాకింగ్‌ రామ్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందా ??

రఫ్ఫాడిస్తున్న హీరోయిన్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదంటున్న ముద్దుగుమ్మలు

ట్రెండ్‌ అవుతున్న ఆలియా.. ఆమె వెంటనే సంయుక్త జాజికాయ

కాంట్రవర్సీలను జక్కన్న కావాలనే క్రియేట్‌ చేస్తారా ??