కాంట్రవర్సీలను జక్కన్న కావాలనే క్రియేట్ చేస్తారా ??
రాజమౌళి సినిమాలు, వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. కృష్ణుడు, రాముడిపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, మహేష్ బాబుతో రాముడి పాత్రను చూపించడం, 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ వేడుకలో దేవుళ్లపై నమ్మకం లేదని చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. బాహుబలి, RRR చిత్రాల సమయంలోనూ ఆయన చరిత్ర వక్రీకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వివాదాలు రాజమౌళి కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
అనుకున్నదొకటి.. అయ్యిందొక్కటి అనే మాటను గుర్తుచేసుకుంటోంది రాజమౌళి కాంపౌండ్. వారణాసి గ్లింప్స్ గురించి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ సినిమా చేయబోయే కలెక్షన్ల గురించి, ఫ్యూచర్‌లో వారణాసి ప్రభావం మిగిలిన సినిమాలమీద ఎలా ఉండబోతోందో అన్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటారు అనుకుంటే… రాజమౌళి కాంట్రవర్శీల మీద ఫోకస్ పెరుగుతోందిప్పుడు. తన సినిమాల్లో చరిత్రను, దేవుళ్లను, పౌరాణికాలను టచ్ చేయడం రాజమౌళికి కొత్తేం కాదు. కాకపోతే, ఆయా సబ్జెక్టుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ మాత్రం కొత్తగా అనిపిస్తున్నాయి జనాలకు. ఆ మధ్య కృష్ణుడు, రాముడు గురించి మాట్లాడుతూ… కృష్ణుడి సబ్జెక్ట్ తీస్తే కమర్షియల్‌గా ఎక్కువ ఫీజబులిటీ ఉంటుందన్నారు. రాముడి జీవితం ప్లెయిన్‌గా ఉంటుందని చెప్పారు. ఈ మాటలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు ఆడియన్స్. రాముడి జీవితంలో కమర్షియాలిటీ ఉండదన్న దర్శకుడు ఇప్పుడు మహేష్‌ని రాముడిగా స్క్రీన్ మీద చూపించబోతున్నారు. అందులోనూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ వేడుకలో తనకు దేవుళ్ల మీద నమ్మకం లేదన్నారు. తన తండ్రి, భార్య హనుమంతుడిని నమ్ముతారని చెబుతూనే… దేవుడుంటే ఇలా ఎందుకు జరిగిందంటూ లీకుల గురించి ఆవేశపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వారణాసి వేడుకలో రాజమౌళి మాటలే కాదు, టైటిల్ కూడా కాంట్రవర్శీని లేవనెత్తింది. ఎప్పుడో ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేశామన్నది చాంబర్ వేదికగా జరిగిన ఆరోపణ. ఇప్పటికే రాజమౌళీస్ వారణాసి అనేది అన్నిచోట్లా ఉంది కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనవసరం ఉండదంటున్నారు క్రిటిక్స్. ఈ మధ్య బాహుబలి యానిమేషన్ వీడియోలోనూ బాహుబలికి ఇంద్రుడితో యుద్ధం అనే లింకు పెట్టినప్పుడు కూడా నరుడికి, దేవేంద్రుడితో యుద్ధం ఎలా సాధ్యం అనే మాటలు వినిపించాయి. ఆ మధ్య కొమరం భీమ్ పేరు పెట్టి చరిత్రను వక్రీకరించారంటూ ట్రిపుల్ ఆర్ రిలీజ్ టైమ్‌లోనూ విమర్శలు ఎదుర్కొన్నారు రాజమౌళి. అయితే, ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సమాధానం చెబుతూ ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలువలో దిగి.. ఎక్కలేకపోయిన ఏనుగు.. ఆ తర్వాత
బిగ్ బాస్ హౌస్‌లో వేధింపులు.. మహిళా కమిషన్ సీరియస్
కోతికి దశదిన కర్మ.. 4 వేల మందికి భోజనాలు !
ఎరక్కపోయి వెళ్లి.. ఇరుక్కుపోవడమంటే ఇదే
Top 9 ET: విజిల్ కొట్టేందుకు రెడీయా.. | బంగారు బిడ్డకు.. నాన్న నుంచి క్యూట్ విషెస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

