AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రీ రిలీజ్‌లో మాటల తూటాలు.. వీటితో టిక్కెట్లు తెగుతాయా ??

ప్రీ రిలీజ్‌లో మాటల తూటాలు.. వీటితో టిక్కెట్లు తెగుతాయా ??

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 1:58 PM

Share

సినిమా ప్రమోషన్ల పేరుతో దర్శకులు, నటులు చేసే వింత ప్రకటనలు, ప్రమాణాలు విమర్శల పాలవుతున్నాయి. సినిమా ఆడకపోతే ఇండస్ట్రీ వదిలేస్తానని, అర్థనగ్నంగా తిరుగుతానని, చెప్పుతో కొట్టుకుంటానని చెప్పడం, ఇది ప్రేక్షకులలో చులకన భావాన్ని పెంచుతుంది. కంటెంట్‌పైనే కాకుండా, సరైన ప్రచార పద్ధతులపై దృష్టి పెట్టాలి తప్ప, ఇలాంటి స్టంట్స్ వల్ల లాభం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

ప్రమోషన్లు రోజు రోజుకూ వింతగా కనిపిస్తున్నాయి. సినిమా ఆడకపోతే ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతా.. చెప్పుతో కొట్టుకుంటా.. అర్ధనగ్నంగా తిరుగుతా… ఇలాంటి మాటలు ప్రీ రిలీజ్‌ టైమ్స్ లో చాలా వినిపిస్తున్నాయి. అంత అవసరమా? అని కొందరు అంటుంటే, ప్రమోషనల్‌ స్టంటూ అని పెదవి విరుస్తున్నారు మరికొందరు. నా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే.. అమీర్పేట్ లో అర్థనగ్నంగా తిరుగుతా అన్నారు డైరక్టర్‌ సాయిలు. రాజు వెడ్స్ రాంబాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సాయిలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ గురించి నెట్టింట్లో రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నవాళ్లు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తారా? అని కొందరు అంటుంటే, అదేమైనా దేశ సేవా? బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నవారికి ఏం మాట్లాడాలో తెలియదా? అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మాస్‌ జాతర టైమ్‌లోనూ రాజేంద్రప్రసాద్‌ ఇలాంటి మాటలే చెప్పారు. మాస్ జాతర సినిమా క్లైమాక్స్లో విజిల్స్ పడకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా అంటూ శపథం చేశారు రాజేంద్రప్రసాద్.. దానికి ముందు రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్‌ టైమ్‌లో.. సినిమా ఆడకపోతే పేరు మార్చుకుంటా అన్నారు. రాబిన్‌హుడ్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పుడు… ‘రాజేంద్రప్రసాద్‌ ఇంకా పేరు మార్చుకోలేదేం..’ అనే విమర్శలు తలెత్తాయి. ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్నవారు.. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి ముందు ఆచితూచి వ్యవహరించాలన్న సలహాలూ వినిపిస్తున్నాయి. ఆ మధ్య త్రిబాణదారి బార్బరిక్‌ సినిమా విడుదల సమయంలోనూ ఇలాంటిదే జరిగింది. సినిమా జనాలకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్న డైరక్టర్‌, రిలీజ్‌ అయ్యాక అన్నంత పనీ చేశారు. సినిమా తీసేటప్పుడు కంటెంట్‌ మీద ఫోకస్‌ చేయాలి. ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాలి. అంతే గానీ, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ వల్ల జనాల్లో చులకన కావడం మాత్రం ఖాయం. ఎక్స్ ట్రా టిక్కెట్లు తెగే ప్రసక్తే లేదు అంటున్నారు అనుభవజ్ఞులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: జపాన్‌కి ప్రయాణమవుతున్న ప్రభాస్‌.. ఇంతకీ మేటరేంటి ??

Premante Review: మనం అనుకున్నదొక్కటి.. చూపించింది ఇంకొకటి !! మూవీ రివ్యూ

మనం అనుకున్నదొక్కటి.. అక్కడ చూపించింది ఇంకొకటి!

పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది

ఉస్తాద్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!