AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premante Review: మనం అనుకున్నదొక్కటి.. చూపించింది ఇంకొకటి !! మూవీ రివ్యూ

Premante Review: మనం అనుకున్నదొక్కటి.. చూపించింది ఇంకొకటి !! మూవీ రివ్యూ

Phani CH
|

Updated on: Nov 22, 2025 | 1:52 PM

Share

ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన 'ప్రేమంటే' సినిమా రివ్యూ ఇక్కడ. మొదట ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కనిపించినా, కథలో ఊహించని ట్విస్ట్‌లు ఉన్నాయి. దర్శకుడి ఆలోచన బాగున్నా, సెకండాఫ్‌లో సరైన అమలు లేకపోవడంతో సినిమా నిరాశపరిచింది. ప్రియదర్శి నటన పర్వాలేదు, కానీ ఆనంది, వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం మీకు నచ్చుతుందో లేదో పూర్తి విశ్లేషణలో చూడండి.

బలగం, కోర్టు ఇలాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రియదర్శి. ఆయన హీరోగా సుమ కీలక పాత్రలో వచ్చిన సినిమా ప్రేమంటే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక ప్రేమంటే కథలోకి వెళితే మధుసూధన రావు అలియాస్ ప్రియదర్శి ఒక సెక్యూరిటీ సిస్టం ఆఫీసు ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మానాన్నలు అతనికి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ అది ఇష్టం లేక వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతూ ఉంటాడు. ఆ సమయంలో రమ్య అలియాస్ ఆనందిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. హాయిగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో తన భర్త గురించి ఒక సంచలన నిజం తెలుస్తుంది. అది తెలిసాక చేసేదేం లేక భర్తను సపోర్ట్ చేస్తుంది. ఆనందికి తెలిసిన ఆ నిజం ఏంటి..? అది తెలిసాక రమ్య రియాక్షన్ ఏంటి? అనేది రిమైనింగ్ స్టోరీ. పెళ్లి, పెళ్లాం, పిల్లలు..! మామూలుగా అయితే ఇవన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చూపిస్తుంటారు. ఈ మూవీ ప్రమోషన్స్ చూసాక ఈ మూవీ కథ కూడా ఇదే అనుకుంటారు. కానీ థియేటర్‌కు వెళ్లి కూర్చున్న ఒక అరగంట తర్వాత సినిమాలో వచ్చే ట్విస్ట్‌తో.. అసలు కథ వేరే అని అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇన్ని రోజులు టీజర్, ట్రైలర్‌లో చూసిన కథ.. థియేటర్లో చూస్తున్న కథ ఇది కాదని అనిపిస్తుంది. ఎవరూ ఊహించని ఓ టర్న్ తీసుకుని… అక్కడ్నుంచి కథ ఎటెటో వెళ్లిపోతుంటుంది. ప్రేమంటే సినిమా మొదటి అరగంట నార్మల్‌లా సాగిపోతుంది. పెద్దగా ట్విస్టులు ఏమీ ఉండవు.. కానీ మెయిన్ ట్విస్ట్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అక్కడ్నుంచి కథనం మారిపోతుంది. అయితే దాన్ని డీల్ చేయడంలో డైరెక్టర్‌ నవనీత్ పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఫస్ట్‌ ఆఫ్‌లోని ఫన్, రొమాన్స్ బాగానే అనిపించినా.. ఇంటర్వెల్ నుంచే అసలు సమస్య మొదలవుతుంది. సెకాండాఫ్‌తో.. అది మరింతగా పెరిగిపోతుందే తప్ప తగ్గదు! ఈ సినిమా మొత్తం ఓ టిపికల్‌ లైన్లో వెళుతుది. సినిమాలో కొన్ని సీన్స్ మరీ లాజిక్ లేకుండా ఎక్కువ లిబర్టీ తీసుకొన్నట్టు, సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా అంతే.! ప్రియదర్శి నటన బాగుంది. కానీ ఇది ఆయనకు సూట్ అయ్యే పాత్ర కాదేమో అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. జనరల్‌గా కథ తన చుట్టూ కాకుండా.. కథ చుట్టూ తాను తిరిగే పాత్రలైతేనే దర్శికి బాగా సూట్ అవుతాయి. కానీ ఈ కథ అలా లేకపోయే సరికి .. అలా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ ఆనంది క్యూట్‌గా ఉంది.. చాలా బాగా నటించింది. సుమ కనకాల క్యారెక్టర్ బాగుంది. కనెక్ట్ అయ్యి ఈ పాత్ర చేసిందేమో కానీ.. ఆమె స్థాయి క్యారెక్టర్ అయితే ఇది కాదు. వెన్నెల కిషోర్ ఈ సినిమాకు మేజర్‌ రిలీఫ్‌. చాలా బాగా నవ్వించాడు. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లాంటి వాళ్లు కూడా బానే నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్‌గా బాగుంది. ఇక దర్శకుడు నవనీత్ శ్రీరామ్ విషయానికి వస్తే.. ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. అనుకున్న కథను ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడ్డాడనే చెప్పాలి. మెయిన్ సెకండాఫ్ మీద ఇంకాస్త ఫోకస్ చేస్తే.. సినిమా మరో రేంజ్‌లో ఉండేదేమో అనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనం అనుకున్నదొక్కటి.. అక్కడ చూపించింది ఇంకొకటి!

పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది

ఉస్తాద్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!

ఆంధ్రాకింగ్‌ రామ్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందా ??

రఫ్ఫాడిస్తున్న హీరోయిన్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదంటున్న ముద్దుగుమ్మలు