12A Railway Colony Review: ప్చ్!! రాంగ్ స్టేషన్.. మూవీ రివ్యూ..
అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల నటించిన 12ఏ రైల్వే కాలనీ సస్పెన్స్ థ్రిల్లర్ విడుదలయ్యింది. అనిల్ విశ్వనాథ్ పర్యవేక్షణలో వచ్చిన ఈ చిత్రం, ఆసక్తికరమైన ట్విస్టులు, భయపెట్టే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రచారం చేసినా, నిరాశపరిచింది. నెమ్మదిగా సాగే కథనం, ఊహాజనిత మలుపులు, లాజిక్ లేని సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. నరేష్ నటన పర్వాలేదనిపించినా, ఓవరాల్‌గా చిత్రం మెప్పించలేకపోయింది.
అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా 12ఏ రైల్వే కాలనీ. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించాడు. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.. ఇక 12ఏ రైల్వే కాలనీ కథలోకి వెళితే.. కార్తిక్ అలియాస్ అల్లరి నరేష్ వరంగల్‌లో రాజకీయ నాయకుడు టిల్లన్న అలియాస్ జీవన్ దగ్గర పని చేస్తుంటాడు. ఉప ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో టిల్లన్న చెప్పిన పని చేస్తుంటారు. అదే సమయంలో తన పక్కింట్లో ఉండే ఆరాధన అలియాస్ కామాక్షి భాస్కర్లను చూసి ఇష్టపడతాడు.. ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించేలా చేయడానికి తన ప్రయత్నాలేవో తాను చేస్తుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా ఆరాధనని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆమెతో పాటు వాళ్ల అమ్మను కూడా దారుణంగా హత్య చేస్తారు. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు… ప్రైమ్ సస్పెక్ట్ కింద హీరోని పట్టుకుంటారు. అయితే ఆ కేసును హ్యాండిల్ చేసే రానా ప్రతాప్ అలియాస్ సాయికుమార్ సాయంతో కార్తిక్ అందులోంచి బయటపడతాడు.. కానీ ఆ హత్య ఎవరు చేసారనేదే సినిమాలోని మెయిన్ ట్విస్ట్. మెయిన్ స్టోరీ కూడా ఇదే! కొన్నిసార్లు తమ సినిమా గురించి దర్శక నిర్మాతలు చెప్పే మాటలు ప్రేక్షకులను మాయలో పడేస్తుంటాయి. వాళ్ల ప్రోడక్ట్ కాబట్టి అలాగే ప్రమోట్ చేసుకుంటారు. కానీ అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయనేది సగటు ప్రేక్షకుడు రిలీజ్ తర్వాతే తెలుసుకుంటాడు. ఇప్పుడు 12ఏ రైల్వే కాలనీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో.. పొలిమేర హ్యాంగోవర్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమా చేసానన్నాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. కానీ ఇంకా అందులోనే ఉన్నట్టు.. ఈ సినిమా చూస్తుంటే తెలుస్తుంది. కాకపోతే చేతబడులు వదిలేసాడంతే. 5 నిమిషాల క్లైమాక్స్ ట్విస్ట్ కోసం.. 2 గంటల సినిమా తీసాడేమో అనిపించింది. ప్రతీ 5, 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని దర్శకుడు చెప్పనైతే చెప్పాడు కానీ.. స్క్రీన్ పై అవేమీ కనిపించకపోవడం.. ఉన్న ట్విస్టులు కూడా ఎక్కడో చూసినట్టుగానే ఉండడం… ఈ సినిమాకు బిగ్ మైనస్. పైగా సినిమాలో కొన్ని ట్విస్టుల్లో లాజిక్స్ కూడా చాలా వరకు మిస్ అయినట్లు అనిపిస్తాయి. 12ఏ రైల్వే కాలినీ రన్ టైమ్ 2గంటలా 5 నిమిషాలే.. కానీ.. ముందుకెళ్లకుండా అక్కడే మొరాయించినట్టుంటుంది సినిమా.! మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే ఎంతకీ కదలదు. ఇంటర్వెల్ వరకు అక్కడే ఆగినట్టు అనిపిస్తుంది. అయితే మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ వచ్చినా… సెకండాఫ్లో మళ్లీ అదే తంతు.!! అక్కడక్కడే తిరిగే కథ.. మళ్లీ మళ్లీ వచ్చే సీన్స్.. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే.. ఇవన్నీ రైల్వే కాలనీని రాంగ్ స్టేషన్‌కు తీసుకెళ్లిపోయాయి. పొలిమేరలో చాలా సీన్స్ భయపెడతాయి.. కానీ అలాంటి టీం నుంచి వచ్చిన ఈ చిత్రంలో మాత్రం కమర్షియల్ అంశాలే ఉన్నాయి కానీ… జెన్యూన్‌గా భయపెట్టే సీన్స్ మాత్రం ఒక్కటి కూడా లేవు. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరని ఈ మూవీ టీం చెప్పింది. కానీ ఆ రేంజ్ కాకపోయినా పర్లేదనిపించింది. మరీ వాళ్లు చెప్పినట్లుగా ఇండియన్ సినిమాలోనే రాలేనంత క్లైమాక్స్ ఏం కాదు. అల్లరి నరేష్ కామెడీ చేసినప్పుడే బాగుండేది.. అప్పుడే అతన్ని వెతుక్కుంటూ డిఫరెంట్ కథలు వచ్చేవి.. కానీ ఇప్పుడాయన వెతుక్కుంటూ వెళ్తుంటే ఎందుకో ఒక్కటి కూడా సెట్ అవ్వడంలేదు. అల్లరి నరేష్ నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఏదైనా కూడా అదరగొడుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఇక కామాక్షి భాస్కర్ల పర్లేదు.. బాగా నటించింది. మిగిలిన పాత్రల్లో వైవా హర్ష, జీవన్, గెటప్ శ్రీను, సద్దాం.. పర్లేదు. మిగిలిన వాళ్లు ఓకే. భీమ్స్ సంగీతం బాగుంది. పాటలు, రీ రికార్డింగ్ కూడా సెట్టు అయ్యాయి. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. దర్శకుడు నాని కాసరగడ్డ తనకు ఇచ్చిన పని పూర్తి చేసాడు.. కానీ కథలో షో రన్నర్ అనిల్ విశ్వనాథ్. ఈయన చెప్పినంత షో అయితే సినిమాలో కనబడలేదు. రొటీన్ కథకే.. మధ్యలో కొన్ని ట్విస్టులు యాడ్ చేసి రాసుకున్నాడు ఈయన. పైగా చివర్లో కూడా రొటీన్ ట్విస్ట్‌తోనే సినిమాను ఎండ్ చేసాడు. ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే.. కథతో ఏ మాత్రం సంబంధం లేని ఓ ఎపిసోడ్ కోసం కాశ్మీర్ వరకు వెళ్లారు. దీన్నిబట్టి దర్శకుడిని నిర్మాతలు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది
ఉస్తాద్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!
ఆంధ్రాకింగ్ రామ్‌కి సక్సెస్ తెచ్చిపెడుతుందా ??
రఫ్ఫాడిస్తున్న హీరోయిన్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదంటున్న ముద్దుగుమ్మలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

