రఫ్ఫాడిస్తున్న హీరోయిన్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదంటున్న ముద్దుగుమ్మలు
సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమాపై హీరోయిన్ దివ్యభారతి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. దర్శకుడు నరేష్ ఆమెను 'చిలకా' అని సంబోధించడాన్ని దివ్యభారతి ఖండించారు. మహిళల పట్ల గౌరవం లేని తీరును ప్రశ్నించారు. కోలీవుడ్‌లో గౌరీ కిషన్ బాడీషేమింగ్‌పై స్పందించిన ఘటనను గుర్తుచేస్తూ, పని ప్రదేశంలో మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
మహిళల్ని గౌరవించడం చేతకాదా? చిలకా.. గిలకా అంటూ ఆ పిలుపులేంటి? పద్ధతీ పాడూ ఉండాలి కదా.. అని లేటెస్ట్ గా ఫైర్ అయ్యారో అప్‌కమింగ్ హీరోయిన్. ఈ మధ్యనే చెన్నైలో బాడీ షేమింగ్ గురించి ఓ హీరోయిన్ ధైర్యంగా స్పందించిన తీరు.. ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా మారింది. ఈ పాట రిలీజ్ సందర్భంగా జరిగిన కాన్వర్జేషన్‌ని తప్పు పట్టారు హీరోయిన్ దివ్యభారతి. సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోట్ సినిమా నాయిక ఆమె. ఈ సినిమాకు నరేష్ దర్శకుడు. అయితే నిర్మాతతో మనస్పర్థల కారణంగా ప్రాజెక్ట్ సగం నుంచి తప్పుకున్నారట. మేకర్స్ ఓడియమ్మా అనే పాటను విడుదల చేయడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు నరేష్. హీరోయిన్‌ని చిలకా అని ఆ పోస్టులో సంబోధించారు. ఓ మహిళను చిలకా అని పిలవడమేంటని ఫైర్ అయ్యారు నాయిక దివ్యభారతి. దర్శకుడు అలా పిలిస్తే హీరో కిమ్మనకుండా ఉండటమేంటని ప్రశ్నించారు. సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు డైరక్టర్ పేరు ఉండటం, ఇప్పుడు లిరికల్ వీడియో క్రెడిట్స్ లో డైరక్టర్ పేరు లేకపోవడాన్ని నోటీస్ చేశారు నెటిజన్లు. కోలీవుడ్‌లో గౌరీకిషన్ బాడీషేమింగ్‌ని ప్రశ్నించిన తీరును గుర్తుచేసుకుంటున్నారు. ఎంత బరువుంటే ఏంటి? కేరక్టర్‌కి కావాల్సిన వ్యక్తిని దర్శకుడు ఛూజ్ చేసుకుంటారు? అసలు ఆ ప్రశ్నలేంటి అంటూ మహిళలను హేళనగా మాట్లాడటాన్ని గౌరీ కిషన్ నిలదీసిన తీరు నేషనల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి ఇష్యూ జరగడంతో మహిళలను గౌరవించలేనివారు గొప్ప క్రియేటివిటీని ఎలా చూపించగలుగుతారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ స్పేస్‌లో మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలనే సలహాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెండ్ అవుతున్న ఆలియా.. ఆమె వెంటనే సంయుక్త జాజికాయ
కాంట్రవర్సీలను జక్కన్న కావాలనే క్రియేట్ చేస్తారా ??
కాలువలో దిగి.. ఎక్కలేకపోయిన ఏనుగు.. ఆ తర్వాత
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

