ఎరక్కపోయి వెళ్లి.. ఇరుక్కుపోవడమంటే ఇదే
ఆదిలాబాద్‌లో రీల్స్ పిచ్చితో ఇద్దరు యువకులు పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మైనర్‌తో సహా యువకుడిపై కేసు నమోదైంది. ఈ ఘటనతో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రీల్స్‌తో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఇది.
ఇటీవల యువత రీల్స్ పిచ్చితో వారేం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఎలాపడితే అలా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నెట్టిం పాపులర్ అవ్వాలని వారు చేసే ప్రయత్నాలు వారికేకాకుండా ఇతరులను చిక్కుల్లో పడేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే అదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఇద్దరు యువకులు చేసిన పని వారిని కటకటాల వెనక్కి పంపింది. అంతటితో ఆగక ఓ హోంగార్డ్ ఉద్యోగమూ చిక్కుల్లో పడింది. నవంబరు 16న ఆదిలాబాద్ జిల్లా ఏరోడ్రంలో ఓపెన్ డ్రింకింగ్ పై పోకస్ పెట్టిన పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గ్రౌండ్ లో పార్క్ చేసి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఓ ఇద్దరు యువకులు ఆ పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ చేయాలనుకున్నారు. పోలీసులు అలా వెళ్లగానే ఇద్దరు యువకులూ ఆ పెట్రోలింగ్ వాహనంలోకి ఎక్కి రీల్స్ చేస్తుండగా మరో యువకుడు రికార్డ్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ వీడియోకు మాంచి మాస్ వార్నింగ్ ఆడియోను జోడించి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ రీల్ కాస్తా వైరల్ గా మారి, పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో అలర్ట్ అయిన జిల్లా పోలీసులు విచారణ చేపట్టి సదరు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. అందులో ఒకరు మైనర్ కాగా.. మరొక యువకుడు షేక్ ఫయాజ్ గా తేల్చారు వన్ టౌన్ పోలీసులు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెట్రోలింగ్ వాహనం డ్రైవర్, పోలీసు సిబ్బందిపై సైతం శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏరోడ్రం వద్ద బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పెట్రోలింగ్ వాహనాన్ని వాడుకుని వీడియోలను చిత్రీకరించి ఇద్దరు యువకులు వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు సీఐ సునీల్ వివరించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Top 9 ET: విజిల్ కొట్టేందుకు రెడీయా.. | బంగారు బిడ్డకు.. నాన్న నుంచి క్యూట్ విషెస్
అది నాలుకా తాటిమట్టా.. తనూజపై దారుణ ట్రోల్స్
బ్యాంకు కస్టమర్స్‌కు అలర్ట్.. ఆ నెంబర్ సిరీస్ నుంచి కాల్ వస్తేనే సేఫ్
టక్కులు, టైలతో వచ్చి.. ఆర్‌బీఐ అంటూ బిల్డప్ ఇచ్చి .. రూ.7.11 కోట్లు దోచేసిన గ్యాంగ్
కుమార్తె వివాహం చేయలేకపోతున్నా.. మనస్తాపంతో తండ్రి తీవ్ర నిర్ణయం
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

