అది నాలుకా తాటిమట్టా.. తనూజపై దారుణ ట్రోల్స్
బిగ్ బాస్ 9 ఫ్యామిలీ వీక్‌లో తనూజ రెండు నాలుకల ధోరణి బయటపడింది. రీతూ, డీమాన్ పవన్ రిలేషన్‌షిప్‌పై కళ్యాణ్ పడాల వద్ద ఒక మాట, భరణి, దివ్య వద్ద మరో మాట చెప్పి ట్రోలర్లకు అడ్డంగా దొరికిపోయింది. ఒకసారి రీతూను, మరోసారి పవన్‌ను తప్పుబట్టి సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతోంది. ఈ వీడియో ప్రూఫ్‌లతో నెటిజన్లు తనూజను దారుణంగా విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా రన్ అవుతోంది. ఎట్ ప్రజెంట్ ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్‌గా సాగుతోంది. ఈక్రమంలోనే తనూజ సోషల్ మీడియాలో మరో సారి అడ్డంగా దొరికిపోయింది. ఎప్పుడూ బిగ్ బాస్ షోని నిశితంగా గమనిస్తూ ఉండే ట్రోలర్స్ ఈ సారి తనూజ రెండు నాలుకల ధోరణిని బయపెట్టారు. రీతూ, డీమాన్ పవన్! ఈ ఇద్దరి విషయంలో .. వేరు వేరు కంటెస్టెట్స్ దగ్గర ఈ అమ్మడు ఎలా వాగిందో.. వీడియో ప్రూఫ్‌తో సహా బయటపెట్టారు. ఈ కారణంతోనే తనూజను దారుణంగా ట్రోల్ చేయడం కూడా షురూ చేశారు. ఇక రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. డీమాన్, రీతూ రిలేషన్ షిప్ గురించి తనూజ రెండు మాటలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ముందుగా కళ్యాణ్ పడాల దగ్గర డీమాన్ గేమ్ రీతూ వల్ల ఎప్పుడూ ఆగలేదని.. కానీ రీతూ ఓ పిచ్చిది.. డీమాన్ వల్ల రీతూ బ్యాడ్ అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. కళ్యాణ్‌తో జరిగిన ఈ సీన్‌లో డీమాన్ పవన్‌ను బ్యాడ్ చేసింది. కట్ చేస్తే… భరణి, దివ్య దగ్గరి సీన్ మాత్రం తనూజ తన నాలుక మడతేసింది. తన స్టేట్మెంట్‌ను రివర్స్ చేసింది. డీమాన్ – రీతూ విషయంలో… డీమాన్ దే తప్పన్నట్టు చెప్పింది. డీమాన్ గేమ్‌కు రీతూ మైనస్ అని.. ఒక వేళ రీతూ లేకుండా డీమాన్ పవన్ గేమ్ ఆడితే ఎక్కడో ఉండేవాడంటూ… భరణి, దివ్యతో చెప్పింది. ఈ సీన్‌లో రీతూను బ్యాడ్ చేసింది. ఇలా రెండు సీన్లలో.. వేరు వేరు డిస్కషన్స్‌లలో ఒక సారి రీతూనే మరొక సారి పవన్‌ను బ్యాడ్ చేసి ట్రోలర్స్‌కు అడ్డంగా దొరికేసింది. సోషల్ మీడియాలో అది నాలుగా లేక తాటిమట్టా అనే కామెంట్‌తో దారుణంగా ట్రోల్ అవుతోంది తనూజ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంకు కస్టమర్స్‌కు అలర్ట్.. ఆ నెంబర్ సిరీస్ నుంచి కాల్ వస్తేనే సేఫ్
టక్కులు, టైలతో వచ్చి.. ఆర్‌బీఐ అంటూ బిల్డప్ ఇచ్చి .. రూ.7.11 కోట్లు దోచేసిన గ్యాంగ్
కుమార్తె వివాహం చేయలేకపోతున్నా.. మనస్తాపంతో తండ్రి తీవ్ర నిర్ణయం
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

