కుమార్తె వివాహం చేయలేకపోతున్నా.. మనస్తాపంతో తండ్రి తీవ్ర నిర్ణయం
కామారెడ్డి జిల్లా నెమ్లిలో హృదయ విదారక ఘటన. దినసరి కూలీ వీరయ్య, కుమార్తె వివాహానికి డబ్బులు లేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఐదేళ్లుగా ప్రయత్నించినా ఆర్థిక కష్టాలు తీరకపోవడంతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. పేదరికం, కుమార్తె భవిష్యత్తుపై ఆందోళనతో కన్నీటి పర్యంతమైన ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరిక.
కడుపున పుట్టిన కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి అనుకున్నారు ఆ పేద తండ్రి. దినసరి కూలీగా పనిచేస్తున్న వీరయ్య ..ఐదేళ్లుగా ఆ ప్రయత్నాలు చేసినా.. డబ్బు కూడబెట్టలేకపోవడంతో ఇక నావల్ల కాదనుకొని మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలో జరిగింది. ఎస్సై రాఘవేంద్ర కథనం ప్రకారం.. నెమ్లికి చెందిన చిట్టె వీరయ్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల కిందట పెద్ద కుమార్తె వివాహం చేశారు. రెండో కుమార్తె సంధ్య డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటోంది. ఆమెకు వివాహం చేయాలని ఐదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది. ‘కుమార్తె పెళ్లి చేయడానికి నా వద్ద డబ్బు లేదు.. నేను చనిపోతా’ అని వీరయ్య పలువురి వద్ద బాధ పడుతూ చెప్పేవారు. దానికి తోడు ఆయన ఆస్తమాతో ఇబ్బంది పడేవారు. మంగళవారం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికారు. చివరికి బుధవారం నెమ్లి శివారు అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి బంధువు గుర్తించారు. తమ తండ్రి మృతి తమనెంతో బాధించిందని పెద్ద కుమార్తె రజనీ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటి ప్రత్యూష కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
Samantha: సమంత పై రాజ్ నిడిమోరు కామెంట్స్
కోచింగ్ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్ స్టోరీ
ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ డ్రైవర్.. ఏం చేశాడంటే
కారు డ్రైవర్ దాష్టీకం.. సైడ్ ఇవ్వలేదని
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

