Samantha: సమంత పై రాజ్ నిడిమోరు కామెంట్స్
ఫ్యామిలీ మ్యాన్ 3 విడుదల నేపథ్యంలో దర్శకుడు రాజ్ నిడుమోరు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమంత, నిమ్రత్ కౌర్ నటన అద్భుతమని, అయితే పాత్రలు తేలికైనవని ఆయన అనడం సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. నటీనటుల విషయంలో లింగ భేదం చూడనని రాజ్ చెప్పినప్పటికీ, "తేలికైన పాత్రలు" అన్న వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి రాజ్ నిడుమోరు మాట్లాడారు. రాజ్ వ్యాఖ్యలపై ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. “ఈ సిరీస్ కోసం మేం రాసిన పాత్రలు మొదట ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు అన్నారు రాజ్ నిడిమోరు. సమంత , నిమ్రత్ కౌర్ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని, నిజానికి వారికి ఆ పాత్రలు చేయడం చాలా తేలిక అయినప్పటికీ వాళ్లు ఎంతో కష్టపడి ఆ పాత్రల్లో జీవించారు” అన్నారు. అదే సమయంలో, నటీనటుల విషయంలో తాను లింగ భేదాలు చూడనని స్పష్టం చేశారు. “పాత్రలో నటించేది పురుషుడా? మహిళా? అని నేను పట్టించుకోను. నా దృష్టిలో ఇద్దరూ సమానమే. స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుందో దానినే నేను అనుసరిస్తాను” అని వివరించారు. అయితే, ఎంతో క్లిష్టమైన పాత్రలకు ప్రాణం పోసిన నటీమణుల గురించి మాట్లాడుతూ ‘పాత్రలు తేలికైనవి’ అని ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత… రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోచింగ్ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్ స్టోరీ
ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ డ్రైవర్.. ఏం చేశాడంటే
కారు డ్రైవర్ దాష్టీకం.. సైడ్ ఇవ్వలేదని
క్యూలో నిలబడి రూ.5ల భోజనం చేసిన కలెక్టర్
నీ ధైర్యానికో దండంరా సామీ.. దాన్ని పట్టుకుని ఆలా ఎలా వెళ్ళావు రా..
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

