AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్‌ స్టోరీ

కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం.. ఐబొమ్మ రవి లవ్‌ స్టోరీ

Phani CH
|

Updated on: Nov 22, 2025 | 12:15 PM

Share

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఐబొమ్మ రవి వ్యక్తిగత అవమానాల నుండి పైరసీ కింగ్‌గా మారిన వైనం ఇది. భార్య, అత్తల విమర్శలతో డబ్బు సంపాదించాలనే పట్టుదలతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లు సృష్టించాడు. పోలీసులకే సవాల్ విసిరి, ఓటీటీ సినిమాలను వెంటనే పైరసీ చేసి టాలీవుడ్‌కు వేల కోట్ల నష్టం కలిగించాడు. చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

ఏపీ నుంచి ఆఫ్రికా దాకా నెట్‌వర్క్. పోలీసులకే సవాళ్లు విసిరే ధైర్యం. టాలీవుడ్‌కు వందల కోట్ల రూపాయలు నష్టం తెచ్చిన డెకాయిట్, ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవికి ఐదురోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఐదు రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. అయితే రవి చేసింది చట్టరీత్యా తప్పే అయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఫ్యాన్‌ఫాలోయింగ్‌ మామూలుగా లేదు. రవికి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రవి లైఫ్‌స్టయిల్ గురించి తెగ సెర్చ్‌ చేస్తున్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగి.. అమీర్‌పేట కోచింగ్‌ సెంటర్‌లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు ప్రతిరూపంగా అందమైన కూతురు.. ఇదే అతడి జీవితం. కానీ డబ్బు సంపాదించడం చేతకాదు అంటూ ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లి అవమానించడంతో అవమానంగా ఫీలైన రవి.. పట్టుదలతో ఐబొమ్మ అనే వెబ్ సైట్ సృష్టించాడు. సినిమాలను పైరసీ చేసి ఆ వెబ్ సైట్ లో పెట్టి ఇండస్ట్రీకి.. నిర్మాతలకు వేల కోట్ల నష్టం కలిగించాడు. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి.. విడుదలైన గంటల్లోనే సినిమా హెచ్డీ ప్రింట్స్ ఐబొమ్మలో షేర్ చేసి.. అడియన్స్ ఫ్రీగా చూసేలా చేశాడు. ఇంకేముంది సినీప్రముఖులు, నిర్మాతలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని పట్టుకునేందుకు రంగంలో దిగారు పోలీసులు. అదే సమయంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాలు విసరడంతో.. ఫోకస్ చేసి మరీ అతడిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఇప్పుడు ఐబొమ్మ రవి.. అలియాస్ ఇమంది రవి పేరు మారుమోగుతుంది. తన భార్య, అత్త ప్రతిక్షణం అవమానించడంతోనే ఎలాగైనా డబ్బు సంపాదించాలని తాను ఐబొమ్మ వెబ్ సైట్ క్రియేట్ చేసినట్లు రవి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఏడాది పాటు సంతోషంగా గడిపిన రవి జంట మధ్య ఆర్థిక సమస్యలు చిచ్చుపెట్టాయి. ప్రతిక్షణం భార్య.. ‘విదేశాల్లో ఉన్న మా అక్క, బావ కోట్లు సంపాదిస్తుంటే నీకు అది చేతగావటం లేదు’ అంటూ అవమానించేదట. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు రావటంతో విడాకుల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె కుమార్తెను భార్య తీసుకెళ్లడంతో రవి ఒంటరిగా మిగిలాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న రవి.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని సినిమాలు పైరసీ చేశాడట. గేమింగ్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగించినట్లు విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లను క్రియేట్ చేసి.. ఓటీటీలో విడుదలైన వెంటనే సినిమాలను పైరసీ చేశాడట. జీవితంలో ఎదురైన అనుభవాలతో అతడు మనుషులపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయిన రవి నాలుగేళ్లుగా ఒంటిరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రికీ దూరంగా ఉంటున్నాడు. రెండు నెలలకో దేశం తిరిగి.. చివరకు ఇంటికి చేరేవాడట రవి. మనుషులపై నమ్మకం తగ్గిపోవడంతో ఎవరితోనూ మాట్లాడేందుకు అంత సుముఖత చూపేవాడు కాదని సమాచారం. విడాకులకు సిద్ధంగా ఉన్న భార్యతో మాట్లాడి, విడాకులు తీసుకోవటంతో బాటు విశాఖ, హైదరాబాద్ ఆస్తులు అమ్ముకుని శాశ్వతంగా విదేశాలకు వెళ్లి, అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న దశలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ డ్రైవర్‌.. ఏం చేశాడంటే

కారు డ్రైవర్‌ దాష్టీకం.. సైడ్‌ ఇవ్వలేదని

క్యూలో నిలబడి రూ.5ల భోజనం చేసిన కలెక్టర్‌

నీ ధైర్యానికో దండంరా సామీ.. దాన్ని పట్టుకుని ఆలా ఎలా వెళ్ళావు రా..

పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు