ఏం పాపులారిటీనో ఏమో..చెత్తగా మాట్లాడుతున్నారు..! హీరోయిన్ ఆవేదన
సినీ తారలది లగ్జరీ జీవితం అనుకున్నా, వారికి ఆన్‌లైన్ వేధింపులు, నెగటివ్ కామెంట్స్‌తో నిజమైన కష్టాలున్నాయి. మరాఠి నటి గిరిజా ఓక్ వంటివారు పాపులారిటీ కారణంగా అసభ్యకర ప్రశ్నలు, దూషణలు ఎదుర్కొంటున్నారు. గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయి, అనామక సోషల్ మీడియా దాడులకు గురవుతున్నారు. ఈ వాస్తవం వారి గ్లామర్ వెనుక దాగివుంది.
సినిమా తారలది లగ్జరీ లైఫ్ అనుకుంటారు చాలా మంది. విశాలమైన భవనాల్లో ఉంటారు.. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు.. విందులు, వినోదాల్లు మునిగితేలుతుంటారు. వీరికేం కష్టాలు ఉంటాయి? అని భావిస్తుంటారు. అయితే సినిమా సెలబ్రిటీలకు కూడా చాలా ఇబ్బందులుంటాయి. మనలా స్వేచ్ఛగా బయట తిరగలేరు. సినిమాలు, షికార్లకెళ్లలేరు. నిజం చెప్పాలంటే పాపులారిటీ, క్రేజ్ ఏ సినిమా వాళ్లకు పెద్ద శత్రువు. ఇక సోషల్ మీడియా లో సినిమా తారలకు ఎదరయ్యే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంత మంది అదే పనిగా హీరోలు,హీరోయిన్లను విమర్శిస్తుంటారు. అసభ్యకర పదజాలంతో దూషిస్తుంటారు. కొందరు ఈ విషయాలను బయటకు చెప్పుకోరు. మరికొందరు ధైర్యంగా తమ ఆవేదనను పంచుకుంటారు. అలా ఇటీవల బాగా వైరలవుతోన్న నటి గిరిజా ఓక్ .. సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ప్రముఖ మరాఠి నటి గిరిజా ఓక్ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. నెట్టింట చాలా మంది ఈమె నామస్మరణే చేస్తున్నారు. ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తోన్న ఈ అందాల తార ఒకే ఒక్క ఇంటర్వ్యూ క్లిప్స్ వల్ల సడన్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. లేటు వయసులో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఆమె ఫాలోవర్లు అమాంతం పెరిగారు. క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. అయితే ఇదే తనకు చేటు తెచ్చిందంటోంది గిరిజా ఓక్. ఈ పాపులారిటీ, క్రేజ్ కారణంగా తన జీవితంలో ఎలాంటి మార్పు లేదని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన గిరిజా ఓక్.. ఎట్ ప్రజెంట్ ఈ పాపులారిటీ వల్ల తనకేమీ సినిమా ఆఫర్లు రావడం లేదన్నారు. పైగా నెగెటివ్ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయని.. రేటెంత? అంటూ చాలా ఛండాలంటూ కామెంట్ చేస్తున్నారని.. తననో గంటసేపు గడపడానికి ఎంత తీసుకుంటావ్? అని ప్రశ్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు గిరిజా. అంతేకాదు సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదని.. తనను దూషించే వాళ్లకు నిజ జీవితంలో తాను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరని.. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు మాత్రం చేయరన్నారు. కానీ ఈ ఆన్‌లైన్ చాటున మాత్రం వీరు నోటికి ఏదొస్తే అది వాగేస్తారని చెప్పుకొచ్చారు ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

